Breaking News

Viral Video: స్కూటీ నడుపుతూ వర్క్ కాల్‌.. ఈ ఐటీ ఉద్యోగి కష్టం చూడండి..

Published on Sun, 03/24/2024 - 18:14

ఏ ఉద్యోగంలో అయినా పని ఒత్తిడి మామూలే. అయితే ఇది ఐటీ పరిశ్రమలో మరీ ఎక్కువగా కనిపిస్తోంది. బెంగళూరులో ఓ వ్యక్తి ల్యాప్‌టాప్‌లో వర్క్ కాల్‌లో అటెండ్‌ అవుతూ స్కూటర్ నడుపుతున్న వీడియో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన తర్వాత వర్క్-లైఫ్ బ్యాలెన్స్, 70 గంటల వర్క్‌ వీక్‌ చర్చ సోషల్ మీడియాలో తిరిగి మొదలైంది.

పీక్ బెంగుళూరు అనే హ్యాండిల్‌పై ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో షేర్ చేసిన ఈ క్లిప్ దేశ ఐటీ రాజధాని మూసచిత్రాన్ని చూపించింది. ఇక్కడ టెక్ నిపుణులు బహిరంగ ప్రదేశాల్లో తమ ల్యాప్‌టాప్‌లపై పనిలో నిమగ్నమై ఉండటం సర్వసాధారణమే. అయితే ఈ ఉద్యోగి మాత్రం ఓ వైపు స్కూటర్‌ నడుపుతూ.. మరోవైపు ల్యాప్‌టాప్‌ను ఒళ్లో పెట్టుకుని వర్క్‌ కాల్‌ అటెండ్‌ అవుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. 

వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజనులు పలు విధాలుగా స్పందించారు. "బ్రో ఐటీ కంపెనీలో ఉండాలంటే పని చేస్తూనే ఉండాలి. వారానికి 70 గంటల సమయం కూడా సరిపోదు" అని ఓ యూజర్‌ కామెంట్‌ చేశారు. "క్లయింట్ కాల్, మరణం ఎప్పుడైనా రావచ్చు" అని మరో యూజర్‌ చమత్కారంగా రాసుకొచ్చారు.  "ఈ రోజుల్లో పని ఒత్తిడి చాలా ఎక్కువే. అయినా ఇలా మాత్రం చేయొద్దు" అని ఇంకొక యూజర్‌ హితవు పలికారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)