Breaking News

వారెవ్వా ఓనరు..ఫిదా చేశావ్‌ గురూ! ఏం చేశాడో తెలిస్తే!

Published on Sat, 06/03/2023 - 11:56

బెంగళూరు: ప్రపంచ ఆర్థికమాంద్యం ఆందోళనలు చిన్నా, పెద్ద సంస్థల్ని భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా దిగ్గజ కంపెనీలు ఖర్చులను నియంత్రించుకునే పనులను ఇప్పటికే మొదలు పెట్టాయి. ఇక నిధులను సమకరించుకోవడంలో స్టార్ట్‌ప్‌ కష్టాలను సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  అయితే  ఇండియన్‌ సిలికాన్‌ వ్యాలీ బెంగుళూరులో ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన పరిణామం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇంటి యజమాని, భూస్వామి తన ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి  సంస్థ (స్టార్టప్‌)లో భారీగా పెట్టుబడులు పెట్టాడు. దీనికి సంబంధించిన కథనం ఇపుడు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది.

వివరాళ్లోకి వెళ్లితేఏఐ పవర్డ్‌  మ్యారేజ్‌ యాప్‌ ‘బెటర్‌హాఫ్’ కో-ఫౌండర్‌, సీఈవో పవన్‌ గుప్తా ఈ కథనాన్ని సోషల్‌మీడియాలో  పోస్ట్‌ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. బిజినెస్‌ చాలా కష్టంగామారిపోయిన ప్రస్తు సమయంలో ఊహించని ఇన్వెస్టర్‌  నాకు దొరికాడు అంటూ తన ఇంటి యజమాని సంభాషణల స్క్రీన్‌షాట్‌ను పోస్ట్‌ చేశారు.

సుశీల్‌  కుమార్‌ అనే  ల్యాండ్‌ లార్డ్‌ తన ఇంట్లో ఉంటున్న వ్యక్తి నిర్వహిస్తున్న ‘బెటర్‌హాఫ్’ అనే మ్యారేజ్‌ బ్యూరో స్టార్టప్‌  కంపెనీపై ఎనలేని విశ్వాసాన్ని ప్రకటించాడు. ఏకంగా 10 వేల డాలర్లు  (రూ. 8 లక్షలు) ఎలా పెట్టుబడి పెట్టాడు. ఈ విషయాన్ని పవన్‌తో వాట్సాప్ ద్వారా షేర్‌ చేసుకున్నారు.  నిజాయితీగా పెట్టుబడి పెడుతున్నా అంటూ  పవన్‌ వెంచర్‌పై  విశ్వాసాన్ని వ్యక్తం  చేశారు. అంతేకాదు ఆల్ ది బెస్ట్ , మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నానంటూ అభినందలు తెలిపారు. దీంతో నెటిజన్లు యజమాని  ఔదార్యంపై ఫిదా అవుతున్నారు.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)