ఆ ఒక్క నగరంలో 10 లక్షల మంది టెకీలు..

Published on Wed, 05/28/2025 - 07:08

భారత సిలికాన్‌ వేలీగా పేరొందిన బెంగళూరులో టెకీ సిబ్బంది సంఖ్య 10 లక్షల మార్కును దాటింది. తద్వారా అంతర్జాతీయంగా 12 టెక్నాలజీ హబ్‌లలో ఒకటిగా నిలిచింది. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ సీబీఆర్‌ఈ విడుదల చేసిన గ్లోబల్‌ టెక్‌ టాలెంట్‌ గైడ్‌బుక్‌ 2025’లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం నిపుణుల లభ్యత, నాణ్యత, వ్యయాల ప్రాతిపదికన 115 మార్కెట్లను మదింపు చేసి మూడు కేటగిరీలుగా వర్గీకరించారు.

అత్యధిక స్థాయిలో నిపుణుల లభ్యత, తీవ్రమైన పోటీ ఉన్న మార్కెట్లను పవర్‌హౌస్‌లుగా, ప్రతిభావంతుల లభ్యత నిలకడగా ఉండే మార్కెట్లను ఎస్టాబ్లిష్డ్ మార్కెట్లుగా, సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటూ వృద్ధి చెందుతున్న మార్కెట్లను వర్ధమాన మార్కెట్లుగా వర్గీకరించారు. 12 టెక్‌ పవర్‌హౌస్‌లలో బీజింగ్, బోస్టన్, లండన్, న్యూయార్క్, ప్యారిస్‌ తదితర నగరాల సరసన బెంగళూరు కూడా నిల్చింది.

ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో బీజింగ్, షాంఘైతో పాటు బెంగళూరులో అత్యధికంగా టెక్నాలజీ నిపుణులు ఉన్నారని, టెక్‌ సిబ్బంది సంఖ్య 10 లక్షల పైగా ఉందని నివేదిక పేర్కొంది. గ్లోబల్‌ టెక్‌ పవర్‌హౌస్‌గా బెంగళూరు ఎదగడమనేది భారత్‌లో డిజిటల్‌ ఆవిష్కరణలు, కృత్రిమ మేథకు సంబంధించి లోతైన పరిజ్ఞానాన్ని తెలియజేస్తోందని వివరించింది.

ఇదీ చదవండి: అప్పుడు రూ. 3500కోట్ల వ్యాపార సామ్రాజ్యం: ఇప్పుడు 20ఏళ్ల జైలు జీవితం

ఉద్యోగం చేసే వయస్సు గల జనాభాపరంగా 12 భారీ మార్కెట్లలో బెంగళూరు నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. 28 యూనికార్న్‌లు (1 బిలియన్‌ డాలర్ల పైగా వేల్యుయేషన్‌ గల స్టార్టప్‌లు), సానుకూల నిబంధనలు మొదలైనవి నగరానికి సానుకూలాంశాలుగా ఉంటున్నాయి. 2024లో 3.3 బిలియన్‌ డాలర్లు విలువ చేసే 140 వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ డీల్స్‌కి బెంగళూరు కేంద్రంగా నిల్చింది. వీటిలో 34 డీల్స్‌ కృత్రిమ మేథకు సంబంధించినవి ఉన్నాయి.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)