Breaking News

హాయి నిద్రకోసం.. బెడ్‌రూమ్‌ గ్యాడ్జెట్స్

Published on Sun, 09/07/2025 - 14:32

రోజంతటి అలసట ఇట్టే పోగొట్టే మందు ఒక్కటే, అదే హాయినిద్ర!. అందుకే, ప్రపంచాన్ని మరచిపోయేలా, ప్రశాంతమైన నిద్రకోసం ఇవి మీ బెడ్‌రూమ్‌లో తప్పకుండా ఉండాలి.

మాయాదీపం!
ఊహించుకోండి.. మీ మంచం పక్కన ఒక చిన్న మాయాదీపం ఉందని. ఎందుకంటే, ఈ బెడ్‌సైడ్‌ ల్యాంప్, సాధారణ బెడ్‌ల్యాంప్‌ కాదు. ఇదొక మూడ్‌ మ్యాజిక్, మల్టీ యూజ్‌ ఫ్రెండ్‌. రాత్రి పడుకున్నప్పుడు ఒక్క టచ్‌ చేస్తే మెల్లగా వెలిగే వార్మ్‌ లైట్‌తో పాటు, పుస్తకం చదవాలనిపిస్తే కూల్‌ వైట్‌ లైట్, పార్టీ మూడ్‌కి బ్రైట్‌ లైట్‌. అన్నీ మీ వేళ్ల అంచుల్లోనే! మొబైల్ ఛార్జింగ్ అయిపోయిందా? ప్లగ్‌ కోసం వెతకాల్సిన అవసరం లేదు. ల్యాంప్‌ మీద ఫోన్‌ పెట్టేయండి. వాచ్, ఇయర్‌ఫోన్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పరికాలన్నింటినీ దీంతోనే చార్జ్‌ చేసుకోవచ్చు. అంతేకాదు, ఇందులో ఉన్న డిజిటల్‌ క్లాక్‌తో అలారం కూడా సెట్‌ చేసుకోవచ్చు. ధర  రూ. 3,900.

ఆకాశం అంతా మీ గదిలోనే!
ఆరుబయట మంచం వేసుకొని చుక్కలు లెక్కపెడుతూ పడుకునే రోజులు గుర్తున్నాయా? గాలి తాకుతూ, ఆకాశం చూస్తూ కలల్లో తేలిపోయే ఆ మజానే వేరు. ఇప్పుడు ఆ అనుభూతి మళ్లీ పొందటానికి ఆరుబయట మంచం వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆకాశం అంతా మీ గదిలోకే దిగిపోతుంది. ఒక్కసారి ఈ స్టార్‌షిప్‌ ల్యాంప్‌ ఆన్  చేస్తే, గది గోడల మీద నక్షత్రాలు, చంద్రుడు, మేఘాలు, గ్రహాలు అన్నీ మెరిసిపోతూ మీ గదినే గగనమండలంలా మార్చేస్తాయి. మొబైల్‌కి కనెక్ట్‌ చేసుకొని యాప్‌ ద్వారా కలర్స్, బ్రైట్‌నెస్, స్పీడ్‌ అన్నీ మీ మూడ్‌కి తగినట్టుగా మార్చుకోవచ్చు. టైమర్‌ సెట్‌ చేస్తే మీరు కలల్లో తేలుతుండగానే దానంతట అదే ఆఫ్‌ అవుతుంది. ధర రూ.2,890.

ఇదీ చదవండి: భారత్‌పై ప్రశ్న.. చైనా రోబో సమాధానం

వెచ్చని దుప్పటి
చల్లని రాత్రుల్లో వణుకుతూ నిద్రపోవడం ఇక మానేయండి. ఎందుకంటే ఇప్పుడు హీటెడ్‌ అండర్‌ బ్లాంకెట్‌ ఉంది. ఒక్క బటన్‌తో మీ మంచాన్ని వెచ్చగా, సౌకర్యంగా మార్చేస్తుంది. దీన్ని ఉపయోగించడం చాలా ఈజీ. దుప్పటిని మంచం మీద సెట్‌ చేసి, పవర్‌కి కనెక్ట్‌ చేయండి. కంట్రోల్‌ స్విచ్‌లో మీకు కావాల్సిన లో, మీడియం, హై అనే ఉష్ణస్థాయులను ఎంచుకోండి. నిమిషాల్లోనే మంచం మొత్తం వెచ్చగా మారిపోతుంది. రాత్రంతా వెచ్చదనం కొనసాగుతుంది. ఉదయం లేవగానే కేవలం స్విచ్‌ ఆఫ్‌ చేస్తే చాలు. ఉతకాల్సినప్పుడు ప్లగ్‌ తీసేసి వాషింగ్‌ మెషిన్ లో వేసేసుకోచ్చు. మృదువైన, నాణ్యమైన కాటన్ తో తయారైన ఈ దుప్పటి ధర కేవలం రూ.3,749 మాత్రమే!

#

Tags : 1

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)