Breaking News

రోల్‌మోడల్‌గా భారత్‌.. కార్పొరేట్‌ గవర్నెన్స్‌పై రాష్ట్రపతి పిలుపు

Published on Thu, 10/05/2023 - 10:35

న్యూఢిల్లీ: కార్పొరేట్‌ గవర్నెన్స్‌ విషయంలో భారత్‌ రోల్‌ మోడల్‌గా ఎదిగేందుకు కంపెనీ సెక్రటరీలు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. అలాగే, వ్యాపారాలు, పెట్టుబడులను ప్రోత్సహించే చట్టాలు అమలయ్యేలా చూడటంలో తమ వంతు తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ) 55వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విజ్ఞప్తి చేశారు.

ప్రపంచానికి సారథ్యం వహించగలిగే దేశంగా భారత్‌ ముందుకు పురోగమిస్తోందని ముర్ము పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశీయంగా వృత్తి నిపుణులు తగిన అర్హత కలిగినవారై ఉండటంతో పాటు సాహసోపేతంగా, సృజనాత్మకంగా కూడా వ్యవహరించాలని ఆమె చెప్పారు. కంపెనీ సెక్రటరీల సంకల్పంపైనే దేశ కార్పొరేట్‌ గవర్నెన్స్‌ భవిష్యత్‌ ఆధారపడి ఉందన్నారు.

కార్పొరేట్‌ గవర్నెన్స్‌కు పునరంకితం కావాలి 
మెరుగైన కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ప్రమాణాల పాటింపునకు కంపెనీ సెక్రటరీలు పునరంకితం కావాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  ఈ కార్యక్రమంలో సూచించారు. ఐసీఎస్‌ఐ నెలకొల్పిన ఉత్తమ ప్రమాణాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని కితాబిచ్చారు. అగ్నివీర్, డిఫెన్స్‌ సిబ్బంది, అమరవీరుల కుటుంబాలకు చెందిన వారు కంపెనీ సెక్రటరీ కోర్సులో చేరితే రిజిస్ట్రేషన్‌ ఫీజు నుంచి మినహాయింపునివ్వాలని ఐసీఎస్‌ఐ నిర్ణయం తీసుకోవడం, అమరవీరుల కుమార్తెల విద్యాభ్యాసం కోసం రూ. 11 లక్షల విరాళమివ్వడం ప్రశంసనీయమని ఆమె పేర్కొన్నారు.

వ్యాపార నిర్వహణను సులభతరం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో భారత్‌లోకి గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో 230 బిలియన్‌ డాలర్ల పైచిలుకు పెట్టుబడులు వచ్చినట్లు పేర్కొన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు, వ్యాపారాలు నిర్వహించేందుకు కంపెనీల్లో నెలకొన్న ఆసక్తిని ఇది సూచిస్తోందన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)