ఐటీసీలో రూ. 12,941 కోట్ల షేర్ల విక్రయం

Published on Thu, 05/29/2025 - 07:27

న్యూఢిల్లీ: మాతృ సంస్థ, బ్రిటిష్‌ దిగ్గజం బ్రిటిష్‌ అమెరికన్‌ టొబాకో(బీఏటీ) తాజాగా దేశీ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీలో మైనారిటీ వాటా విక్రయించింది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో బ్లాక్‌డీల్స్‌ ద్వారా 2.5 శాతం వాటా అమ్మివేసింది. షేరుకి రూ. 413కుపైగా సగటు ధరలో 31.3 కోట్ల షేర్లను విక్రయించింది. వీటి విలువ రూ. 12,941 కోట్లు(1.51 బిలియన్‌ డాలర్లు)కాగా.. ఎన్‌ఎస్‌ఈలో మంగళవారం ధర రూ. 434తో పోలిస్తే 4.8 శాతం డిస్కౌంట్‌లో వాటాను ఆఫర్‌ చేసింది.

కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు. ఈ లావాదేవీకి ముందు కంపెనీలో బీఏటీ వాటా 25.44 శాతంగా నమోదైంది. అనుబంధ సంస్థల ద్వారా ప్రస్తుతం 22.94 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా నిలుస్తోంది. ఐటీసీలో 1900 సంవత్సరం ప్రారంభంలోనే బీఏటీ పెట్టుబడులకు తెరతీసింది.

తద్వారా దీర్ఘకాలంగా రెండు దిగ్గజాలూ లబ్ధి పొందుతూ వస్తున్నాయి. అయితే 2024 మార్చిలోనూ ఐటీసీలో 3.5 శాతం వాటాను రూ. 17,485 కోట్లకు బీఏటీ విక్రయించడం గమనార్హం! బ్లాక్‌డీల్‌ నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్‌ఈలో బుధవారం 3.2 శాతం క్షీణించి రూ. 420 వద్ద ముగిసింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)