బార్‌క్లేస్‌ బ్యాంక్‌ పెట్టుబడులు.. రూ. 2,300 కోట్లకు రెడీ

Published on Thu, 03/20/2025 - 18:52

ముంబై: దేశీ అనుబంధ సంస్థ బార్‌క్లేస్‌ బ్యాంక్‌ పీఎల్‌సీ ఇండియాకు బ్రిటిష్‌ మాతృ సంస్థ బార్‌క్లేస్‌ బ్యాంక్‌ రూ. 2,300 కోట్ల మూలధనం సమకూర్చనుంది. తద్వారా బ్యాంక్‌ బ్యాలన్స్‌షీట్‌ పటిష్టంకావడంతోపాటు ఇన్వెస్ట్‌మెంట్, ప్రయివేట్‌ బ్యాంకింగ్‌లో బిజినెస్‌ విస్తరించేందుకు సహాయపడనుంది.

దీంతో మరింతమంది క్లయింట్లకు బ్యాంక్‌ చేరువకానుంది. ప్రధానంగా కార్పొరేట్, ఫైనాన్షియల్‌ పెట్టుబడులున్న క్లయింట్లు, అత్యంత సంపన్న వర్గాలలో మరింత విస్తరించనున్నట్లు బార్‌క్లేస్‌ బ్యాంక్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. వెరసి ప్రపంచంలోనే వేగవంత వృద్ధిలో ఉన్న ఆర్ధిక వ్యవస్థపట్ల దీర్ఘకాలిక కట్టుబాటును ప్రదర్శిస్తున్నట్లు తెలియజేసింది.

బార్‌క్లేస్ ఇండియా ఆర్థిక పరిస్థితి
ఇండియా రేటింగ్స్ ప్రకారం.. బార్‌క్లేస్ ఇండియా క్యాపిటల్ అడెక్వసీ రేషియో (సీఏఆర్) 2024 మార్చి చివరి నాటికి 15.93 శాతంగా ఉంది. బాసెల్-3 మార్గదర్శకాల ప్రకారం బ్యాంకు కనీసం టైర్-1 మూలధన నిష్పత్తిని 11 శాతంగా నిర్వహించాలి.

2024 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి భారత్‌లో కంపెనీ ఆస్తులు రూ.53,910 కోట్లుగా ఉన్నాయి. బార్‌​క్లేస్‌ ఇండియా రుణాల్లో ఎక్కువ భాగం టర్మ్ లోన్స్ (2024 ఆర్థిక సంవత్సరంలో 49.2 శాతం), బిల్ డిస్కౌంటింగ్ (35.0 శాతం), వర్కింగ్ క్యాపిటల్ రుణాలు (15.8 శాతం) ఉన్నాయని ఇండియా రేటింగ్స్ తెలిపింది.

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)