Breaking News

బ్యాంకులకు డిపాజిట్ల కష్టాలు

Published on Sun, 09/29/2024 - 07:58

న్యూఢిల్లీ: గడిచిన రెండు సంవత్సరాల్లో పెరిగిన రుణ డిమాండ్‌ స్థాయిలో డిపాజిట్ల సమీకరణకు బ్యాంక్‌లు సమస్యలు ఎదుర్కొన్నట్టు ఇన్ఫోమెరిక్స్‌ రేటింగ్స్‌ తెలిపింది. షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంక్‌లు 2023–24లో జారీ చేసిన రుణాలు రూ.1,64,98,006కోట్లుగా ఉన్నాయి. క్రెడిట్‌ టు డిపాజిట్‌ రేషియో (సీడీ రేషియో) ఈ కాలంలో 75.8 శాతం నుంచి 80.3 శాతానికి పెరిగింది. త్రైమాసికం వారీగా చూసిన కానీ షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల డిపాజిట్ల కంటే రుణాల వృద్ధి ఎక్కువగా ఉన్నట్టు ఇన్ఫోమెరిక్స్‌ నివేదిక తెలిపింది.

2018–19 నుంచి 2023–24 మధ్య కాలంలోనూ డిపాజిట్ల కంటే రుణాల వృద్ధి ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. ప్రత్యామ్నాయ పెట్టుబడుల సాధనాలు, అసంఘటిత రంగంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నగదు ఎక్కువగా ఉండడం డిపాజిట్ల సమీకరణపై ప్రభావం చూపించినట్టు ఈ నివేదిక తెలిపింది. 30 ఏళ్లలోపు ఇన్వెస్టర్ల సంఖ్య 2018–19 నాటికి 22.6 శాతంగా ఉంటే, 2025 జూలై నాటికి 39.9 శాతానికి పెరగడాన్ని ప్రస్తావించింది. యువ ఇన్వెస్టర్లలో ఈక్విటీ మార్కెట్ల పట్ల పెరిగిన ఆసక్తిని ఈ ధోరణి తెలియజేస్తున్నట్టు పేర్కొంది. ఇదే కాలంలో 30–39 వయసులోని ఇన్వెస్టర్ల బేస్‌ (సంఖ్య) స్థిరంగానే ఉన్నట్టు తెలిపింది.  

సంయుక్త కృషి అవసరం: డిపాజిట్ల నిష్పత్తి పెరగాలంటే బ్యాంక్‌లు, ప్రభుత్వం ఉమ్మడిగా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ట్రూనార్త్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సీఈవో రోచక్‌ బక్షి అభిప్రాయపడ్డారు. సాధారణ ప్రజల నుంచి చిన్న మొత్తాల్లో డిపాజిట్లు సమీకరించే వెనుకటి ధోరణి నుంచి బయటకు రావాలని.. పెద్ద మొత్తంలో కార్పొరేట్‌ డిపాజిట్లను ఆకర్షించడంపై దృష్టి సారించాలని సూచించారు.

బ్యాంక్‌ టర్మ్‌ డిపాజిట్లలో 47 శాతం 60 ఏళ్లు నిండిన వృద్ధులవే ఉన్నట్టు, యువతరం బ్యాంక్‌ డిపాజిట్ల వట్ల ఆసక్తి చూపించడం లేదన్న దానికి నిదర్శనమని చెప్పారు. కనీసం ఆదాయపన్ను అధిక శ్లాబులోని వారికి అయినా బ్యాంక్‌ డిపాజిట్ల వడ్డీపై పన్ను భారాన్ని తగ్గించాలని భక్షి సూచించారు. ఏటా వడ్డీపై టీడీఎస్‌ మినహాయించడం కాకుండా, డిపాజిట్‌ కాల వ్యవధి ముగిసిన సమయంలోనే పన్నును పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)