Breaking News

బ్యాంకులకు రంజాన్‌ సెలవు లేదా?

Published on Sat, 03/29/2025 - 20:49

ముస్లింలకు పర్వదినమైన రంజాన్‌ మార్చి 31న వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. అయితే బ్యాంకులకు మాత్రం ఆరోజు సెలవు లేదు. ఎందుకంటే ఆరోజు ఈ ఆర్థిక సంవత్సరానికి చివరి రోజు. ఈ నేపథ్యంలో మార్చి 31న బ్యాంకులు క్లియరింగ్ ఆపరేషన్‌లో పాల్గొనాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ లావాదేవీల అకౌంటింగ్‌ను సులభతరం చేస్తుంది. పండుగలు, వారాంతపు సెలవులతో సంబంధం లేకుండా దేశం అంతటా ఆదాయపు పన్ను, సీజీఎస్టీ కార్యాలయాలు మార్చి 29 నుండి మార్చి 31 వరకు తెరిచి ఉంటాయి.

భారతదేశంలో సాధారణంగా ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై మరుసటి ఏడాది మార్చి 31న ముగుస్తుంది.  2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏజెన్సీ బ్యాంకులు నిర్వహించే అన్ని ప్రభుత్వ లావాదేవీలను అదే ఆర్థిక సంవత్సరంలో నమోదు చేయాలని ఆర్బీఐ గతంలో పేర్కొంది. ప్రభుత్వ రశీదులు, చెల్లింపులను నిర్వహించే అన్ని ఏజెన్సీ బ్యాంకులు, శాఖలు మార్చి 31న సాధారణ పని గంటలు ముగిసే వరకు ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన ఓవర్ ది కౌంటర్ లావాదేవీల కోసం తెరిచి ఉండాలని అపెక్స్ బ్యాంక్ కోరింది.

చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్) కింద స్టాండర్డ్ క్లియరింగ్ టైమింగ్స్ మార్చి 31న  వర్తిస్తాయని ఆర్బీఐ తాజాగా ఒక సర్క్యులర్‌ విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించిన అన్ని ప్రభుత్వ లావాదేవీలను మార్చి 31 నాటికి లెక్కించడానికి వీలుగా మార్చి 31న ప్రభుత్వ చెక్కుల కోసం ప్రత్యేకంగా సీటీఎస్ కింద ప్రత్యేక క్లియరింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు సర్క్యులర్‌లో పేర్కొంది. అన్ని బ్యాంకులు ఈ ప్రత్యేక క్లియరింగ్ ఆపరేషన్లలో పాల్గొనాలని సర్క్యులర్‌లో ఆదేశించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)