Breaking News

బ్యాంకుల్లో ఊహించని మార్పులు.. వారానికి 5 రోజులే పని..ఇంకా

Published on Sun, 07/23/2023 - 19:27

గత కొంత కాలంగా వారంలో ‘ఐదురోజులే పనిదినాల’పై ప్రభుత్వ బ్యాంక్‌ ఉద్యోగులు కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పుడు ఆ డిమాండ్లు, ప్రతిపాదనలు చివరి దశకు వచ్చాయి. ఐదు రోజుల పనిదినాలపై మరో ఐదు రోజుల‍్లో ప్రభుత్వ బ్యాంక్‌ ఉద్యోగుల భవితవ్యం తేలనుంది. జులై 28న కేంద్రం సైతం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  

వారానికి ఐదు రోజులే పనిదినాలు. ఈ సంస్కృతి ప్రైవేట్‌ రంగ సంస్థల్లో గత కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు ఈ కార్పొరేట్‌ వర్క్‌ కల్చర్‌ ప్రభుత్వ కార్యాలయాలకు పాకింది. ఎల్‌ఐసీ వంటి ప్రభుత్వ సంస్థలు వారానికి ఐదు రోజుల పనిదినాల్ని కొనసాగిస్తుండగా.. తమకు వారాంతంలో రెండు రోజుల సెలవుల సంస్కృతిని కొనసాగించాలని  ప్రభుత్వ బ్యాంక్‌ రంగ సంస్థలు సైతం డిమాండ్‌ చేస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో వచ్చే శుక్రవారం ( ఏప్రిల్‌28న).. ఇండియన్‌ బ్యాంకింగ్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) యూనైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ)లు సమావేశం కానున్నాయి. ఈ భేటీలో ఐదు రోజుల పని, వేతన పెంపు, గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీల గురించి చర్చించనున్నాయి. వీటన్నింటికంటే వారానికి ఐదురోజుల పనిదినాలపై ప్రధానంగా దృష్టిసారించనున్నాయి.  

ప్రస్తుతం, బ్యాంకుల్లో మొదటి, మూడవ శనివారం కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. యూఎఫ్‌బీయూ బ్యాంక్‌ ఉద్యోగులు వారినికి రెండురోజుల సెలవులిస్తూ వారానికి ఐదు రోజులు పనిచేసే వెసలు కల్పించాలని కోరుతుంది. వారానికి ఐదు రోజుల పని కల్పించాలన్న యూఎఫ్‌బీయూ డిమాండ్‌పై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గతంలో ఆర్ధిక శాఖ తెలిపింది. ఈ మేరకు ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ కేంద్రానికి ప్రతిపాదన పంపింది. ప్రతిపాదన ప్రకారం, వారంలో ఒకరోజు పని తగ్గుతున్నందున, దీనికి బదులుగా 5 రోజుల పాటు,  సిబ్బంది పనివేళలను రోజూ మరో 40 నిమిషాల పాటు పెంచాలని ఐబీఏ భావిస్తోంది. 

దీంతో పాటు పదవీ విరమణ చేసిన వారికి రూ.2లక్షల వరకు ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీకి యూబీఎఫ్‌యూ అంగీకరించింది. దీనికి అదనంగా టాపప్‌ పాలసీని రూ.10లక్షల వరకు తీసుకునేందుకు ఆప్షనల్‌ విధానంలో అనుమతించాలని కోరుతోంది. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే..బ్యాంక్‌ ఉద్యోగులు ఇకపై ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేయాల్సి వస్తుందని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

చదవండి👉 భారత్‌లో టెస్లా కార్ల తయారీ.. ఎలాన్‌ మస్క్‌కు మెలిక పెట్టిన కేంద్రం!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)