Breaking News

గోల్డ్‌ లోన్‌ చెల్లింపు విధానంలో మార్పులు

Published on Wed, 11/20/2024 - 15:11

బంగారంపై రుణాల కోసం బ్యాంకులు, గోల్డ్ లోన్ అందించే సంస్థలు నెలవారీ చెల్లింపు ప్రణాళికలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రస్తుత రుణ పంపిణీ ప్రక్రియలో అంతరాలను గుర్తించినట్లు ఇటీవల విడుదల చేసిన సర్క్యులర్‌లో వెల్లడించింది. కొత్తగా అమలు చేయాలనుకుంటున్న విధానం ప్రకారం రుణగ్రహీతలు లోన్‌ ప్రారంభమైనప్పటి నుంచే ఈఎంఐల ద్వారా ఏకకాలంలో వడ్డీ, అసలు చెల్లించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఉన్న పరిస్థతి

బంగారు ఆభరణాలపై రుణం తీసుకునేవారు నిర్ణీత కాలం తర్వాత వడ్డీతో కలిపి మొత్తం అప్పు  తీరుస్తున్నారు. వినియోగదారుల వద్ద నగదు ఉన్నప్పుడు పాక్షికంగా రుణం చెల్లించే అవకాశం ఉంది. కానీ నెలవారీ ఈఎంఐ పద్ధతి లేదు. ఒకవేళ రుణగ్రహీతలకు రుణ కాలావధి కంటే ముందే డబ్బు సమకూరితే ఒకేసారి రుణం తీర్చే వెసులుబాటు అయితే ఉంది.

ప్రతిపాదిత విధానం

బంగారంపై రుణాలిచ్చే బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థలు తనఖా పెట్టుకుని అప్పు ఇచ్చిన నెల నుంచి వడ్డీ, అసలును ఏకకాలంలో ఈఎంఐ రూపంలో చెల్లించేలా ప్రతిపాదనలున్నాయి. ఆర్థిక సంస్థలు కూడా రుణగ్రహీతలకు లోన్లు ఇచ్చేందుకు వీలుగా టర్మ్‌ లోన్లును తీసుకోవచ్చనేలా విధానాల్లో మార్పులు తీసుకురాబోతున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: ఆరేళ్లలో రూ.84 లక్షల కోట్లకు చేరే రంగం!

అంతరాలు గుర్తించిన ఆర్‌బీఐ

తనఖాపెట్టిన బంగారం విలువను కొన్ని సంస్థలు సరిగ్గా లెక్కించడం లేదని ఆర్‌బీఐ గుర్తించింది. దాంతోపాటు అప్పు తీర్చని వారికి సంబంధించిన బంగారాన్ని వేలం వేయడంలో అవకతవలు జరుగుతున్నాయని తెలిపింది. రుణం ఇచ్చేందుకు బంగారం విలువనే ప్రాతిపదికగా తీసుకోకూడదని స్పష్టం చేసింది. అప్పు చెల్లించేవారి చెల్లింపుల రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. రుణాన్ని రోలోవర్‌ చేయకుండా నెలవారీ చెల్లింపు విధానాన్ని తీసుకురావాలని చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)