Breaking News

బ్యాంక్ జాబ్ వదిలి 'యూ ట్యూబ్'.. ఏటా కోట్లు సంపాదిస్తూ..

Published on Sat, 07/13/2024 - 19:50

చేస్తున్న పనిలో సవాళ్లు లేకుంటే.. కొందరు ఉద్యోగాలకు స్వస్తి చెప్పి, నచ్చినపని చేస్తూ.. కొందరికి సాయపడాలనుకుంటారు. ఇలాంటి కోవకు చెందినవారిలో ఒకరు 'నిశ్చా షా' (Nischa Shah). ఇంతకీ ఈమె ఎవరు? ఈమె గతంలో ఎందుకు ఉద్యోగం వదిలేశారు. ఇరులకు ఎలా సాయం చేస్తున్నారనే విషయాలు ఈ కథనంలో చూసేద్దాం..

'నిశ్చా షా' ఒకప్పుడు లండన్‌లో ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్. ఈ రంగంలో ఈమెకు ఏకంగా తొమ్మిది సంవత్సరాల అనుభవం ఉంది. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా, క్రెడిట్ అగ్రికోల్‌లో అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేస్తూ ఏడాది రెండు కోట్ల రూపాయల కన్నా ఎక్కువ వేతనం తీసుకునేది. చేస్తున్న పనిలో సవాళ్లు కనిపించకపోవడంతో జాబ్ వదిలేయాలనుకుంది. అనుకున్న విధంగా ఉద్యోగం వైదిలేసి యూట్యూబ్ ఛానల్ చెస్ట్ చేసింది.

ఇతరులకు సాయం చేస్తూనే ఆర్థికంగా ఎదగాలని భావించిన నిశ్చా షా.. యూట్యూబ్ ఛానల్ ద్వారా పర్సనల్ ఫైనాన్స్ విషయాలను చెబుతూ కంటెంట్ క్రియేటర్ అవతారమెత్తింది. దీనికోసం 2023లో తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. యూట్యూబ్ ద్వారా ఏకంగా రూ. 8 కోట్ల కంటే ఎక్కువ సంపాదించినట్లు సమాచారం.

ప్రారంభంలో అనుకున్న విధంగా చేయడం కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు.. వెయ్యిమంది సబ్‌స్క్రైబర్‌లను సంపాదించడానికి 11 నెలల సమయం పట్టిందని ఓ ఇంటర్వ్యూలో నిశ్చా షా పేర్కొన్నారు. ఆ సమయంలో పొదుపు చేసుకున్న డబ్బును వినియోగించుకున్నట్లు వెల్లడించారు. ఒక వీడియో బాగా వైరల్ కావడంతో 50వేలమంది సబ్‌స్క్రైబర్‌లను పొందేలా చేసింది. అప్పుడు ఒకేసారి రూ.3 లక్షలు సంపాదించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: 22ఏళ్ళ క్రితం నిర్మించారు.. ఇప్పటికీ అక్కడ టోల్ ట్యాక్స్ ఎక్కువే!    

ఇప్పుడు నిశ్చా షా యూట్యూబ్ ఛానల్ 1.16 మిలియన్ సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉంది. దీంతో ఈమె యూట్యూబ్ వీడియోలు చేస్తూ భారీగానే ఆర్జిస్తోంది. అనుకున్నది సాధించడానికి ఉన్న ఉద్యోగం వదిలి సక్సెస్ సాధించింది. అయితే ఇది అందరికి సాధ్యమయ్యే పని కాదు. ఇలాంటి వాటికి పూనుకునే ముందు పదిసార్లు ఆలోచించడం మంచింది.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)