Breaking News

బ్యాంకులకు వరుస సెలవులు.. ఇదే చివరి నెల!

Published on Sat, 02/28/2026 - 09:52

మార్చి నెలలో అడుగు పెడుతున్నాం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇదే చివరి నెల. పూర్తి చేయాల్సిన బ్యాంకు పనులు చాలానే ఉంటాయి. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు కస్టమర్లు ఈ మార్చి నెలలో తమ బ్యాంకు బ్రాంచ్‌ల సందర్శనలను ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పండుగలు, రాష్ట్రాల వారీగా ఉన్న ప్రత్యేక సెలవులు, అలాగే సాధారణ ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాల కారణంగా అనేక రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ముందస్తుగా షెడ్యూల్‌ను చూసుకోవడం ద్వారా నగదు ఉపసంహరణలు, చెక్ క్లియరెన్సులు వంటి ఇతర బ్రాంచ్ సేవలలో ఆలస్యాలను నివారించవచ్చు.

మార్చిలో బ్యాంకు సెలవులు
» మార్చి 1 (ఆదివారం): దేశవ్యాప్తంగా సాధారణ సెలవు.
» మార్చి 2: హోలికా దహన్‌ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో బ్యాంకులు మూసివేత.
» మార్చి 3: హోలి, డోల్‌జాతర తదితర పండుగల సందర్భంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అస్సాం, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, గోవా, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సెలవు. మార్చి 4: యోసాంగ్‌ (రెండవ రోజు)తో పాటు హోలీ వేడుకల నేపథ్యంలో త్రిపుర, గుజరాత్, మిజోరం, ఒడిశా, చండీగఢ్, ఉత్తరాఖండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, బీహార్, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.
» మార్చి 8 (ఆదివారం): దేశవ్యాప్త సెలవు.
» మార్చి 13: చాప్కార్‌ కత్‌ సందర్భంగా మిజోరంలో బ్యాంకులు మూసివేత.
» మార్చి 14 (రెండో శనివారం): దేశవ్యాప్త సెలవు.
» మార్చి 15 (ఆదివారం): దేశవ్యాప్త సెలవు.
» మార్చి 17: షాబ్‌ ఈ ఖదర్‌ సందర్భంగా జమ్మూ & కాశ్మీర్‌లో బ్యాంకులు మూసివేత.
» మార్చి 19: ఉగాది, గుడి పడ్వా, సాజిబు నోంగ్మా పంబా వేడుకల నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మణిపూర్, జమ్మూ & కాశ్మీర్, గోవా, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.
మార్చి 20: ఈద్‌ ఉల్‌ ఫితర్‌ (రంజాన్), జమాత్‌ ఉల్‌ విదా సందర్భంగా జమ్మూ కాశ్మీర్, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.
» మార్చి 21: రంజాన్-ఈద్, సర్హుల్ తదితర పండుగల కారణంగా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.
» మార్చి 22 (ఆదివారం): దేశవ్యాప్త సెలవు.
» మార్చి 26: శ్రీ రామ నవమి సందర్భంగా మిజోరం, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, చండీగఢ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.
» మార్చి 28 (నాలుగో శనివారం): దేశవ్యాప్త సెలవు.
» మార్చి 29 (ఆదివారం): దేశవ్యాప్త సెలవు.
» మార్చి 31: మహవీర్‌ జయంతి సందర్భంగా ఆర్‌బీఐ సెలవుగా గుర్తించినప్పటికీ, 2025-26 ఆర్థిక సంవత్సరాంత లావాదేవీల దృష్ట్యా ప్రభుత్వ వ్యాపారం నిర్వహించే ఏజెన్సీ బ్యాంకులు ఆ రోజున తెరిచి ఉంటాయి.

యథావిధిగా డిజిటల్ సేవలు
బ్యాంకు బ్రాంచీలకు సెలవులు ఉన్నప్పటికీ ఏటీఎంలు, యూపీఐ, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ సేవలు కొనసాగుతాయి. నిధుల బదిలీలు, బిల్లు చెల్లింపులు వంటి డిజిటల్ లావాదేవీలు అంతరాయం లేకుండా అందుబాటులో ఉంటాయి.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)