Breaking News

వచ్చే నెలలో బ్యాంక్‌ పని ఉందా? ఫిబ్రవరి సెలవులు ఇవే..

Published on Fri, 01/24/2025 - 16:20

సంవత్సరంలో రెండవ నెల ఫిబ్రవరి (February) అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ నెలలో 28 రోజులే ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే ఈ 28 రోజుల్లో కూడా బ్యాంకులు పని చేసేది కొన్ని రోజులే. దేశంలోని బ్యాంకుల నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరిలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసిఉంటాయో  జాబితాను (Bank Holidays) విడుదల చేసింది.

ఫిబ్రవరి నెలలో వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లాల్సినవారు ఈ సెలవుల జాబితాను తప్పక తెలుసుకోవాలి. తద్వారా మీ ప్రాంతంలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసిఉంటాయో.. ఏయే రోజుల్లో పనిచేస్తాయో తెలుస్తుంది. తదనుగుణంగా బ్యాంకింగ్ పనిని ప్లాన్‌ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.

మొత్తం 14 రోజులు
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో బ్యాంకులు మొత్తం 14 రోజులు మూసిఉంటాయి. ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలతోపాటు పండుగలు, పర్వదినాలు, స్థానిక సెలవులు ఇందులో ఉంటాయి. స్థానిక సెలవులు ఆయా రాష్ట్రాల బట్టి ఉంటాయి. ఫిబ్రవరిలో ఏయే రోజుల్లో సెలవులు ఉంటాయన్నది పూర్తి జాబితా ఇక్కడ ఇస్తున్నాం..

ఫిబ్రవరిలో బ్యాంకు సెలవుల జాబితా

  • ఫిబ్రవరి 2: ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు.

  • ఫిబ్రవరి 3: సోమవారం సరస్వతి పూజ సందర్భంగా అగర్తలాలో సెలవు

  • ఫిబ్రవరి 8: రెండవ శనివారం దేశవ్యాప్తంగా సెలవు.

  • ఫిబ్రవరి 9: ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు.

  • ఫిబ్రవరి 11: మంగళవారం థాయ్ పూసం సందర్భంగా చెన్నైలో హాలిడే.

  • ఫిబ్రవరి 12: బుధవారం శ్రీ రవిదాస్ జయంతి సందర్భంగా సిమ్లాలో సెలవు.

  • ఫిబ్రవరి 16: ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు.

  • ఫిబ్రవరి 15: శనివారం లుయి-నగై-ని సందర్భంగా ఇంఫాల్‌లో బ్యాంకులకు సెలవు.

  • ఫిబ్రవరి 19: బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా  బేలాపూర్, ముంబై , నాగ్‌పూర్‌లోని బ్యాంకుల మూత

  • ఫిబ్రవరి 20: గురువారం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఐజ్వాల్, ఇటానగర్‌లో హాలిడే

  • ఫిబ్రవరి 22: నాల్గవ శనివారం దేశవ్యాప్తంగా సెలవు.

  • ఫిబ్రవరి 23: ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు.

  • ఫిబ్రవరి 26:  బుధవారం మహా శివరాత్రి కారణంగా అనేక చోట్ల సెలవు.

  • ఫిబ్రవరి 28: శుక్రవారం లోసార్ కారణంగా గ్యాంగ్‌టక్‌లో బ్యాంకుల మూత.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)