Breaking News

భారీగా బ్యాంకు సెలవులు.. చివరి నెలలో తెరిచేది కొన్ని రోజులే..

Published on Fri, 11/28/2025 - 14:28

నవంబర్‌ నెల ముగుస్తోంది. సంవత్సరంలో చివరి నెల డిసెంబర్‌ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో రానున్న నెలలో చేయాల్సిన పనుల గురించి చాలా మంది ముందుగా షెడ్యూల్‌ వేసుకుంటూ ఉంటారు. వాటిలో ముఖ్యమైనవి బ్యాంకు పనులు. అయితే ఇందు కోసం బ్యాంకు బ్రాంచిలు ఏ రోజుల్లో తెరిచి ఉంటాయి.. ఎప్పుడు సెలవులు ఉంటాయన్నది తెలుసుకోవడం ముఖ్యం. ఈ నేపథ్యంలో రానున్న నెలలో బ్యాంకు సెలవులు ఏయే రోజుల్లో ఉన్నాయో ఇక్కడ అందిస్తున్నాం..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) క్యాలెండర్ ప్రకారం.. ప్రభుత్వ సెలవు దినాలు, వారాంతపు మూసివేత కారణంగా డిసెంబరులో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బ్యాంకులు దాదాపు 18 రోజులు మూసి ఉంటాయి. సెలవుల జాబితాలో ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలతోపాటు జాతీయ, ప్రాంతీయ పండుగలు, ప్రత్యేక సందర్భాలు ఉన్నాయి.

సెలవు దినాలలో అన్ని బ్యాంకు బ్రాంచీల వద్ద సేవలు అందుబాటులో ఉండవు. కాబట్టి ఖాతాదారులు తమ బ్యాంకుల ప్రాంతీయ సెలవు క్యాలెండర్ ప్రకారం బ్రాంచీ సందర్శనలను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, సెలవు దినాలలోనూ ఆల్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పేమెంట్స్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం లావాదేవీలు వంటి ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవచ్చు.

డిసెంబర్‌లో సెలవులు ఇవే..

  • డిసెంబర్ 1 - అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ లలో రాష్ట్ర అవతరణ దినోత్సవం

  • డిసెంబరు 3 - గోవాలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ

  • డిసెంబరు 7- ఆదివారం

  • డిసెంబరు 12 - మేఘాలయలో పా టోగన్ నెంగ్మింజా సంగ్మా వర్ధంతి

  • డిసెంబర్ 13 - రెండో శనివారం

  • డిసెంబరు 14- ఆదివారం

  • డిసెంబర్ 18 - మేఘాలయలో యు సోసో థామ్ వర్ధంతి సందర్భంగా

  • డిసెంబర్ 19- గోవాలో విమోచన దినోత్సవం

  • డిసెంబర్ 20 - సిక్కిం, గోవాలో లోసూంగ్ / నామ్సూంగ్

  • డిసెంబరు 21- ఆదివారం

  • డిసెంబర్ 22 - సిక్కింలో లోసూంగ్ / నామ్సూంగ్

  • డిసెంబర్ 24 - మిజోరం, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో క్రిస్మస్

  • డిసెంబర్ 25 - క్రిస్మస్ సందర్భంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బ్యాంకుల మూసివేత

  • డిసెంబర్ 26 - మిజోరం, నాగాలాండ్, మేఘాలయలలో క్రిస్మస్ వేడుకలు

  • డిసెంబర్ 27 - నాలుగో శనివారం

  • డిసెంబరు 28- ఆదివారం

  • డిసెంబర్ 30 - మేఘాలయలో యు కియాంగ్ నంగ్బా వర్ధంతి

  • డిసెంబర్ 31 - మిజోరాం, మణిపూర్ లలో నూతన సంవత్సర వేడుకలు / ఇమోయిను ఇరాట్పా

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)