Breaking News

ఆగస్టులో హాలిడేస్: ఈ తేదీల్లో బ్యాంకులు పనిచేయవు!

Published on Thu, 07/30/2026 - 16:12

భారతదేశంలోని బ్యాంకులకు జాతీయ సెలవులతో పాటు రాష్ట్రాల వారీగా స్థానిక పండుగలు, సాంస్కృతిక వేడుకలు, ప్రత్యేక దినోత్సవాల సందర్భంగా కూడా సెలవులు ఉంటాయి. వీటికి అదనంగా ప్రతి నెల రెండో శనివారం, నాలుగో శనివారం, అన్ని ఆదివారాలు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి. అందువల్ల బ్యాంకుకు సంబంధించిన పనులు ముందుగానే ప్రణాళిక చేసుకోవడం మంచిది. ఈ కథనంలో 2026 ఆగస్టులో బ్యాంక్ హాలిడేస్ గురించి తెలుసుకుందాం.

  • ఆగస్టు 8: టెండోంగ్ రో రమ్ ఫాత్ - ఈ పండుగ సందర్భంగా సిక్కిం రాష్ట్రంలోని బ్యాంకులు మూసివేయబడతాయి. ఇది సిక్కిం ప్రజలకు చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన పండుగ.

  • ఆగస్టు 13: పేట్రియాట్ డే - మణిపూర్ రాష్ట్రంలో ఈ రోజు వీరమరణం పొందిన దేశభక్తులను స్మరించుకుంటారు. ఈ సందర్భంగా మణిపూర్‌లోని బ్యాంకులు సెలవు పాటిస్తాయి.

  • ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం - భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు.

  • ఆగస్టు 16: పార్సీ నూతన సంవత్సరం - పార్సీ సమాజం నూతన సంవత్సరాన్ని జరుపుకునే సందర్భంగా డామన్ & డయ్యూ, దాద్రా & నగర్ హవేలీ, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని బ్యాంకులు సెలవు పాటిస్తాయి.

  • ఆగస్టు 25: ఈద్-ఎ-మిలాద్ - ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. అయితే అండమాన్ & నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, చండీగఢ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, పంజాబ్, సిక్కిం మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బ్యాంకులు సాధారణంగా పనిచేస్తాయి.

  • ఆగస్టు 26: ఓణం -కేరళ రాష్ట్రంలోని ప్రముఖ పండుగ అయిన ఓణం సందర్భంగా అక్కడి బ్యాంకులకు సెలవు.

  • ఆగస్టు 27: ఝూలన్ యాత్ర - ఒడిశా రాష్ట్రంలో జరుపుకునే ఝూలన్ యాత్ర సందర్భంగా అక్కడి బ్యాంకులకు సెలవు ఉంటుంది.

  • ఆగస్టు 28: రక్షా బంధన్ - అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల మధ్య ప్రేమకు ప్రతీకగా జరుపుకునే రక్షా బంధన్ సందర్భంగా ఛత్తీస్‌గఢ్, డామన్ & డయ్యూ, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.

ఈ సెలవుల కారణంగా బ్యాంక్ బ్రాంచ్ సేవలు అందుబాటులో ఉండకపోయినా, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం కొనసాగుతాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు, అలాగే ఏటీఎం సేవలు సాధారణంగా పనిచేస్తాయని రిజర్వ్ బ్యాంక్ సూచించింది.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)