Breaking News

బ్యాంకులకు నేడు సెలవు ఉందా?

Published on Sat, 04/19/2025 - 08:45

దేశంలోని వివిధ బ్యాంకులను నిత్యం కోట్ల మంది కస్టమర్లు వివిధ పనుల నిమిత్తం సందర్శిస్తూ ఉంటారు. అయితే బ్యాంకులు ఏ రోజుల్లో పనిచేస్తాయి.. ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయన్న సమాచారం తెలియక చాలా మంది తికమక పడుతుంటారు. ఈ శుక్రవారం గుడ్ ఫ్రైడే, ఆదివారం ఈస్టర్ అనే రెండు సెలవుల మధ్య వచ్చే శనివారం వచ్చేసింది కాబట్టి ఈరోజు అంటే ఏప్రిల్ 19న బ్యాంకులు తెరిచిఉంటాయా లేదా అనే అయోమయం నెలకొంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశాల ప్రకారం, ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాలు సెలవు దినాలుగా ఉంటాయి.  దీంతో బ్యాంకులు తెరిచిఉండవు. ఏప్రిల్ 19న నెలలో మూడో శనివారం కావడంతో పాటు ఎలాంటి పండుగ లేనందున బ్యాంకర్లకు లాంగ్ వీకెండ్ ఉండదు. కాబట్టి ఈరోజు ఎలాంటి సెలవు లేదు. యథాప్రకారం తెరిచే ఉంటాయి.

తదుపరి సెలవు ఏప్రిల్ 26న
ఆర్బీఐ వెబ్‌సైట్ ప్రకారం, తదుపరి నిర్దేశిత బ్యాంకు సెలవు ఏప్రిల్ 26న ఉంది. ఇది నెలలో నాలుగో శనివారం. ఆరోజు గౌరీ పూజ సెలవు కూడా ఉంటుంది. ప్రస్తుత నెలలో శనివారం సెలవులతో సహా మొత్తం 13 నిర్దేశిత బ్యాంకు సెలవులు ఉన్నాయి.

ఏప్రిల్ లో బ్యాంకు సెలవుల జాబితా
ఏప్రిల్ 1: బ్యాంకులకు తమ వార్షిక ఖాతాల క్లోజింగ్‌ సెలవు/ సర్హుల్.
ఏప్రిల్ 5: బాబూ జగ్జీవన్ రామ్ జయంతి (హైదరాబాద్ లో మాత్రమే)
ఏప్రిల్ 7: షాద్ సుక్ మైన్సీమ్ (షిల్లాంగ్ లో మాత్రమే)
ఏప్రిల్ 10: మహావీర్ జయంతి
ఏప్రిల్ 14: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి, విషు, బిహు, తమిళ నూతన సంవత్సరాది వంటి వివిధ ప్రాంతీయ నూతన సంవత్సర వేడుకలకు సెలవు.
ఏప్రిల్ 15: బెంగాలీ నూతన సంవత్సరాది / హిమాచల్ డే / బోహాగ్ బిహు (అస్సాం, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌)
ఏప్రిల్ 18:  గుడ్ ఫ్రైడే 
ఏప్రిల్ 26: గౌరీ పూజ, నాల్గవ శనివారం
ఏప్రిల్ 29: పరశురామ్ జయంతి. (హిమాచల్ ప్రదేశ్‌)
ఏప్రిల్ 30: బసవ జయంతి, అక్షయ తృతీయ

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)