Breaking News

హోమ్‌ లోన్‌ కస్టమర్లు మరింత హ్యాపీ..

Published on Fri, 07/04/2025 - 17:24

హోమ్‌ లోన్‌ గ్రహీతలకు ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా మరోసారి శుభవార్త చెప్పింది. గృహ రుణాలపై వడ్డీ రేటును 7.45 శాతానికి తగ్గించింది. ప్రస్తుతం ఇది 7.50 శాతంగా ఉంది. అలాగే కొత్త రుణ గ్రహీతలకు ప్రాసెసింగ్ ఫీజును కూడా మాఫీ చేసినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలసీ రెపో రేటును తగ్గించిన తరువాత గత జూన్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఇప్పటికే గృహ రుణ రేట్లను 8.00 శాతం నుండి 7.50 శాతానికి తగ్గించింది. ఇప్పుడు వడ్డీ రేటును ఇంకాస్త తగ్గించడంతో  హోమ్‌లోన్‌ కస్టమర్లకు మరింత ఉపశమనం కలగనుంది. ఈ తాజా తగ్గింపు గృహ యాజమాన్యం మరింత చౌకగా మారుతుందని, దేశంలోని గృహ రంగంలో డిమాండ్‌ను ఉత్తేజపరిచే ప్రభుత్వ విస్తృత ఆర్థిక లక్ష్యానికి మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు.

జీరో ప్రాసెసింగ్‌ ఫీజు
గృహ రుణాలను మరింత చేరువ చేయడంలో భాగంగా  బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కొత్తగా హోమ్‌ లోన్‌కు దరఖాస్తు చేసుకునేవారికి ప్రాసెసింగ​్‌ ఫీజును కూడా రద్దు చేసింది. ఇంతవరకూ ఈ బ్యాంక్‌ లోన్‌ మొత్తంలో అర శాతం వరకూ ప్రాసెసింగ్‌ రుసుముగా తీసుకొనేది. ఇది గరిష్టంగా రూ.15 వేల వరకూ ఉంటుంది. దీనికి జీఎస్టీ అదనం. కస్టమర్లు లోన్‌ కోసం బ్యాంక్‌ బ్రాంచిల్లోనే కాకుండా పూర్తిగా డిజిటల్‌ విధానంలో బ్యాంక్‌ వెబ్‌సైట్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)