Breaking News

అకౌంట్లో జీరో బ్యాలెన్స్‌.. ఖాతాదారుల గగ్గోలు

Published on Thu, 10/03/2024 - 20:20

బ్యాంకులో తలెత్తిన సాంకేతిక లోపం ఖాతాదారుల గుండె ఆగిపోయినంత పనిచేసింది. ఉన్నట్టుండి అకౌంట్లలో జీరో బ్యాలెన్స్‌ చూపించడంతో కస్టమర్లు ఆందోళనకు గురయ్యారు. వేలాది మంది బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా ఖాతాదారులకు ఈ పరిస్థితి ఎదురైంది.

బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సేవల్లో బుధవారం మధ్యాహ్నం పెద్దఎత్తున అంతరాయం ఏర్పడింది. కస్టమర్లు తమ ఆన్‌లైన్ ఖాతాలను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ ఖాతాలో బ్యాలెన్స్‌ కనిపించడం లేదంటూ గగ్గోలు పెట్టారు. కొందరి అకౌంట్లలో జీరో బ్యాలెన్స్‌ కనిపించడం తీవ్ర ఆందోళనకు దారితీసింది.

సాంకేతిక అంతరాయాలను ట్రాక్ చేసే ప్లాట్‌ఫామ్ డౌన్‌డెటెక్టర్‌లో దీనికి సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తాయి. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, సీటెల్, డల్లాస్, ఫీనిక్స్, హ్యూస్టన్, చికాగో వంటి ప్రధాన నగరాల నుండి సమస్య గురించి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. "ఖాతాలు తాత్కాలికంగా అందుబాటులో లేవు" అని కొంతమందికి, బ్యాంకింగ్ యాప్‌లోకి లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ''కనెక్షన్ ఎర్రర్'' అని చాలా మందికి పాప్ అప్ మెసేజ్‌ చూపించింది.

బ్యాంక్ ఆఫ్ అమెరికా అంతరాయంతో ప్రభావితమైన కస్టమర్‌లు తమకు తలెత్తిన ఇబ్బందులను ‘ఎక్స్‌’ (ట్విటర్‌), రెడ్డిట్‌ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్‌ చేశారు. బ్యాంకు యాజమాన్యంపై ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది కస్టమర్లు సమస్య ఎదురైనట్లు సీఎన్‌ఎన్‌ వార్త సంస్థకు ఇచ్చిన వివరణలో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా అంగీకరించింది. సమస్యను పరిష్కరిస్తున్నామని, ఖాతాదారులకు క్షమాపణలు చెబుతున్నామని బ్యాంక్‌ పేర్కొంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)