Breaking News

బజాజ్‌ ఆటో నుంచి త్వరలోనే ఈ-రిక్షా

Published on Mon, 02/10/2025 - 08:12

బజాజ్‌ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి (మార్చి) ఈ–రిక్షా విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటి వరకు అసంఘటితంగా ఉన్న ఈ విభాగంలో గణనీయమైన వాటాపై దృష్టి సారించింది. ప్రస్తుత త్రైమాసికం చివరికి అనుమతులు రావచ్చని, నెలవారీ రూ.45,000 యూనిట్ల విక్రయ అంచనాతో ఉన్నట్టు బజాజ్‌ ఆటో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ శర్మ తెలిపారు.

‘‘ఆధునిక ‘ఈ–రిక్‌’ను ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆవిష్కరించే ఉద్దేశ్యంతో ఉన్నాం. ఈ విభాగంలో ఇది కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుంది. అటు యజమానులు, ఇటు ప్రయాణికులకు సంతోషాన్నిచ్చే విధంగా ఉత్పత్తి ఉంటుంది’’అని రాకేశ్‌ శర్మ వివరించారు. ఆటో విభాగం స్థాయిలోనే ఈ–రిక్‌ విభాగం కూడాఉంటుందని చెప్పారు.

కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ గురించి మాట్లాడుతూ.. బజాజ్ ఆటో కొత్తగా ప్రవేశపెట్టిన అధిక రేంజ్‌, అధునాతన డిస్‌ప్లేలు, వేగవంతమైన ఛార్జింగ్, అత్యుత్తమ బూట్ స్పేస్ అందించే బజాజ్‌ చేతక్‌ 35 సిరీస్‌ ద్వారా ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ సెగ్మెంట్‌లో మార్కెట్‌ వాటాను పెంచుకోవాలనుకుంటున్నట్లు రాకేశ్‌ శర్మ పేర్కొన్నారు.

"ఇప్పటికే ప్రవేశపెట్టిన రెండు వేరియంట్‌లు ఈ ఈవీ విభాగంలో అధిక మార్కెట్ వాటా కోసం బలమైన పాత్ర పోషిస్తున్నాయి. కొత్త సిరీస్ కూడా దిగువ శ్రేణిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది" అని రాకేశ్‌ శర్మ  ఆశాభావం వ్యక్తం చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)