మహిళలకు ప్రత్యేక హెల్త్‌ ప్లాన్‌ 

Published on Mon, 02/10/2025 - 04:34

పుణె: మహిళల కోసం ప్రత్యేక హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ ‘హెరిజాన్‌ కేర్‌’ను బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ప్రకటించింది. మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని తీసుకొచి్చనట్టు తెలిపింది. క్రిటికల్‌ ఇల్‌నెస్‌ (తీవ్రమైన వ్యాధులు/అనారోగ్యాలు), మేటర్నల్‌ (మహిళల గర్భధారణ, ప్రసవానంతర ఆరోగ్యం), రీప్రొడక్టివ్‌ హెల్త్, వెల్‌నెస్‌ తదితర అన్ని అంశాలకు ఈ ప్లాన్‌లో రక్షణ ఉంటుందని తెలిపింది. 

జీవితంలోని వివిధ దశల్లో మహిళలకు ఆర్థిక భద్రతను ఇచ్చే విధంగా ఉంటుందని పేర్కొంది. విటా షీల్డ్, క్రాడిల్‌ కేర్‌ పేరుతో రెండు రకాల సమగ్రమైన కవరేజీలు ఇందులో ఉంటాయి. విటాషాల్డ్‌ కింద 34 క్రిటికల్‌ ఇల్‌నెస్‌లకు కవరేజీ ఉంటుంది. కావాలంటే ఈ కవరేజీని పెంచుకోవచ్చు. చైల్డ్‌ ఎడ్యుకేషన్‌ కింద.. మహిళ క్రిటికల్‌ ఇల్‌నెస్‌ బారిన పడితే ఆమె పిల్ల ల విద్యా సంబంధింత ఖర్చులను ఈ పాలసీ చెల్లిస్తుంది. 

క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కారణంగా ఉద్యోగం కోల్పోతే ఎదురయ్యే ఆర్థిక అనిశ్చితులకూ రక్షణ కల్పిస్తుంది. క్రాడిల్‌ కేర్‌ కింద మహిళ పునరుత్పాదక ఆరోగ్య అవసరాలకు తగ్గట్లుగా రక్షణ ఉంటుంది. సరోగేట్‌ కేర్‌ (మరొకరి సాయంతో సంతానం పొందడం) కింద.. గర్భాన్ని మోస్తున్న తల్లికి సంబంధించి అయ్యే వైద్య ఖర్చులను చెల్లిస్తుంది. 21–45 ఏళ్ల వయసు మహిళలకు సంతాన లోపాలను అధిగమించే విషయంలోనూ కవరేజీని ఆఫర్‌ చేస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)