Breaking News

అదానీ కంపెనీకి ఐటీ శాఖ నోటీసులు

Published on Mon, 10/06/2025 - 12:58

టాప్‌ బిలియనీర్‌ గౌతమ్‌ అదానీకి (Gautam Adani) ఆదాయపు పన్ను శాఖ షాక్‌ ఇచ్చింది. అదానీ గ్రూప్‌ కంపెనీ ఏసీసీ లిమిటెడ్‌పై రెండు వేర్వేరు డిమాండ్‌‌ నోటీసుల్లో మొత్తం రూ .23.07 కోట్లు జరిమానాలు విధించింది. వీటిని అదానీ గ్రూప్ కంపెనీ అప్పీలేట్ అధికారుల ముందు సవాలు చేయాలని యోచిస్తోంది.

ఆదాయపు పన్ను శాఖ (Income Tax department) జారీ చేసిన డిమాండ్‌ నోటీసుల్లో 2015-16 అసెస్మెంట్ సంవత్సరానికి "ఆదాయానికి సంబంధించిన తప్పుడు వివరాలను అందించడం"పై రూ .14.22 కోట్ల జరిమానా విధించగా, 2018-19 అసెస్మెంట్ సంవత్సరానికి "ఆదాయాన్ని తక్కువగా నివేదించడం"పై మరో రూ .8.85 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది.

సవాలు చేస్తాం..

"నిర్ణీత కాలపరిమితిలో ఆదాయపు పన్ను కమిషనర్ (అప్పీల్స్) ముందు అప్పీళ్లు దాఖలు చేయడం ద్వారా కంపెనీ రెండు ఉత్తర్వులను సవాలు చేస్తుంది. దీంతోపాటు సమాంతరంగా, సంబంధిత ఉత్తర్వుల ప్రకారం లేవనెత్తిన జరిమానా డిమాండ్లపై స్టే కోరుతుంది" అని ఏసీసీ రెగ్యులేటర్ ఫైలింగ్స్‌లో తెలిపింది. ఈ రెండు డిమాండ్‌ నోటీసులను అక్టోబర్ 1న స్వీకరించినట్లు చెప్పిన కంపెనీ.. ఈ జరిమానాలు సంస్థ ఆర్థిక కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం చూపవని తెలిపింది.

అదానీ సిమెంట్ గురించి..

అదానీ సిమెంట్.. అంబుజా సిమెంట్ అనుబంధ సంస్థ. ఇది కంపెనీలో 50 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. 2022 సెప్టెంబర్‌లో అదానీ గ్రూప్ స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్ గ్రూప్ నుండి అంబుజా సిమెంట్స్ దాని అనుబంధ సంస్థ ఏసీసీ లిమిటెడ్‌ను 6.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)