Breaking News

బ్యాంక్‌ ఛార్జీల పెంపు.. యాక్సిస్‌ కస్టమర్లకు అలర్ట్‌!

Published on Tue, 11/03/2026 - 16:27

ప్రముఖ ప్రైవేట్‌ రంగ యాక్సిస్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాదారులకు కీలక అలర్ట్‌. వచ్చే డిసెంబర్ 1 నుంచి దేశీయ, ఎన్నారై సేవింగ్స్‌ అకౌంట్స్‌కు సంబంధించి పలు బ్యాంకింగ్ ఛార్జీలు, నిబంధనలను ఈ బ్యాంక్‌ సవరించనుంది. ఉచిత నగదు లావాదేవీల సంఖ్య తగ్గడంతో పాటు కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోతే విధించే జరిమానాలు, చెక్ రిటర్న్ ఛార్జీలు పెరగనున్నాయి. కొన్ని ప్రీమియం ఖాతాలకు అందించే ఎడ్జ్‌ రివార్డ్‌ పాయింట్లను కూడా నిలిపివేయనుంది.

ఉచిత నగదు లావాదేవీలు తగ్గింపు

ఈజీ యాక్సెస్‌, కృషి, సహజ్‌ తదితర అర్హత కలిగిన ఖాతాల్లో ప్రస్తుతం నెలకు మొదటి నాలుగు నగదు లావాదేవీలు లేదా రూ.లక్ష వరకు లావాదేవీలు ఉచితం. డిసెంబర్ 1 నుంచి ఈ పరిమితి మూడు లావాదేవీలకు తగ్గుతుంది. రూ.లక్ష పరిమితి మాత్రం యథాతథంగా ఉంటుంది. ఈ పరిమితి దాటితే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

కనీస బ్యాలెన్స్ జరిమానా పెంపు

నిర్దేశిత సగటు నెలవారీ బ్యాలెన్స్‌ (AMB) నిర్వహించకపోతే లోటులో 6 శాతం మేర ఛార్జీ విధించే విధానం కొనసాగుతుంది. అయితే సెమీ అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లోని దేశీయ ఈజీ యాక్సెస్‌ ఖాతాలకు గరిష్ట జరిమానా రూ.300, రూ.150 నుంచి రూ.600కు పెరగనుంది. ఎన్నారై ఈజీ యాక్సెస్‌ ఖాతాల్లోనూ ఈ ప్రాంతాలకు గరిష్ట ఛార్జీ రూ.300 నుంచి రూ.600కు పెరుగుతుంది. మెట్రో, పట్టణ ప్రాంతాల్లో గరిష్ట ఛార్జీ రూ.600గానే ఉంటుంది. శాలరీ అకౌంట్లకు ఈ జరిమానాలు వర్తించవు.

రివార్డ్ పాయింట్లు, రిలేషన్‌షిప్‌ విలువ

బర్గుండీ, ప్రయారిటీ, ప్రెస్టీజ్‌, ప్రైమ్ ఎన్నారై, ఈజీ ఎన్నారై ఖాతాలకు ఎడ్జ్‌ రివార్డ్‌ (EDGE REWARD) పాయింట్లను నిలిపివేయనుంది. అలాగే ప్రైమ్‌, ప్రెస్టీజ్‌, ప్రయారిటీ, సంపన్న్‌, అడ్వాంటేజ్‌, అరైజ్‌ ఉమెన్స్‌, బర్గుండీ తదితర ఎంపిక చేసిన ఖాతాల్లో టోటల్ రిలేషన్‌షిప్‌ వాల్యూ (TRV) అవసరాన్ని ప్రస్తుతం ఉన్న 75 శాతం నుంచి 100 శాతానికి పెంచనుంది. దీంతో ఖాతాదారులు నిర్దేశిత స్థాయిలో డిపాజిట్లు లేదా పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది.

చెక్‌ రిటర్న్‌ ఛార్జీలు కూడా పెంపు

అవుట్‌వార్డ్‌ చెక్‌ రిటర్న్‌ ఛార్జీ మొదటి రిటర్న్‌కు రూ.50, తదుపరి రిటర్న్‌లకు రూ.100గా ఉండగా.. ఇకపై ప్రతి రిటర్న్‌కు రూ.200 వసూలు చేయనుంది. ఎన్నారై బర్గుండీ, ప్రయారిటీ, ప్రెస్టీజ్‌, ప్రైమ్‌ ఖాతాల్లో డెలివరీ రిటర్న్‌ ఛార్జీ రూ.50 నుంచి రూ.500కు పెరగనుంది.

ఇదీ చదవండి: తులం బంగారానికి కేజీ వెండి? తగ్గుతోన్న తేడా!

Videos

రాజమండ్రిలో జలమయమైన రోడ్లు

YSRCP నాయకుల అరెస్ట్.. పీఎస్‌కు వెళ్లిన అవినాశ్‌ రెడ్డి

ఇంటి గుమ్మం వద్ద: సిలిండర్‌ డెలివరీ, భారీ పేలుడు

టీడీపీ విజయంపై జడ శ్రవణ్ స్పెషల్ వీడియో.. నవ్వులే నవ్వులు!

రెండేళ్లు వైట్ హౌస్ కు ఇక గడ్డు కాలమేనా?

మురసు తుఫాన్ తో గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు

కండక్టర్ ప్రవళిక మృతదేహానికి మంత్రి పొన్నం నివాళులు

ఈడీ విచారణపై అంబటి క్లారిటీ

నీ వెనుక ఎవడున్నాడని రెచ్చిపోతున్నావ్..? నాయుడుపేట సీఐపై కాకాణి ఫైర్

నువ్వు నన్ను తంతానంటావా? అసలు నువ్వు..!

Photos

+5

'మాయా లేడీ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కేజీఎఫ్' తల్లి.. టాలీవుడ్ ఎంట్రీ (ఫొటోలు)

+5

సమంత కొత్త ఫొటోషూట్ (ఫోటోలు)

+5

చూపులతోనే కట్టిపడేస్తున్న కరీనా కపూర్‌..(ఫోటోలు)

+5

నిర్మాత రమేష్ తౌరానీ దీపావళి పార్టీ... మెరిసిన బాలీవుడ్‌ తారలు (ఫోటోలు)

+5

ముంబై : ‘రామాయణ’ ప్రీమియర్ షో...బాలీవుడ్‌ తారలు సందడి (ఫోటోలు)

+5

'సమ్మర్ హాలిడేస్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫోటోలు)

+5

తెలంగాణ : సిరిసిల్ల జిల్లాలో జానపదాల సింగిడి (ఫోటోలు)

+5

విజయవాడలో దంచికొట్టిన వర్షం.. రహదారులు జలమయం (ఫోటోలు)

+5

'మురసు' విధ్వంసం...ఒంగోలులో అల్లకల్లోలం (ఫోటోలు)