Breaking News

ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లపై కీలక ప్రకటన - ఆ రెండు బ్యాంకులు..

Published on Wed, 08/16/2023 - 18:29

ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును మూడవ సారి కూడా 6.5 శాతం వద్దనే ఎటువంటి సవరణ చేయకుండా ఉంచిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన తరువాత యాక్సిస్ బ్యాంక్ & కెనరా బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తంలో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లకు వడ్డీ రేట్లను సవరించాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

యాక్సిస్ బ్యాంక్..
యాక్సిస్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, సవరణల తరువాత సాధారణ ప్రజలకు ఏడు రోజుల నుంచి పదేళ్లలోపు చేసుకునే డిపాజిట్లపై 3.5 శాతం నుంచి 7.3 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తుంది. అయితే సీనియర్ సిటిజన్లకు మాత్రం ఈ డిపాజిట్లపై 3.50 శాతం నుంచి 8.05 శాతం వరకు వడ్డీ అందించనుంది. అంతే కాకుండా నగదును ముందస్తుగా ఉపసంహరించుకునే వెసలుబాటు కూడా ఇందులో లభిస్తుంది.

  • 7 రోజుల నుంచి 14 రోజులు, 15 రోజుల నుంచి 29 రోజులు, 30 రోజుల నుంచి 45 రోజులు 3.50%
  • 46 రోజుల నుంచి 60 రోజుల వరకు 4.00%
  • 61 రోజులు నుంచి 3 నెలలు 4.50%
  • 3 నెలలు నుంచి 4 నెలలు, 4 నెలలు నుంచి 5 నెలలు, 5 నెలలు నుంచి 6 నెలలు 4.75%
  • 6 నెలలు నుంచి 7 నెలలు, 7 నెలలు నుంచి 8 నెలలు, 8 నెలలు నుంచి 9 నెలలు 5.75%
  • 9 నెలలు నుంచి 10 నెలలు, 10 నెలలు నుంచి 11 నెలలు, 11 నెలల నుంచి 11 నెలల 24 రోజులు 6.00%
  • 11 నెలల 25 రోజులు నుంచి 1 సంవత్సరం 6.00%
  • 1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం 4 రోజులు 6.75%
  • 1 సంవత్సరం 5 రోజుల నుంచి 1 సంవత్సరం 10 రోజులు & 1 సంవత్సరం 11 రోజుల నుంచి 1 సంవత్సరం 24 రోజులు 6.80%
  • 1 సంవత్సరం 25 రోజులు నుంచి 13 నెలలు 6.80%
  • 13 నెలలు నుంచి 14 నెలలు, 14 నెలలు నుంచి 15 నెలలు, 15 నెలలు నుంచి 16 నెలలు వరకు 7.10%
  • 16 నెలలు నుంచి 17 నెలలు 7.30%
  • 17 నెలలు నుంచి 18 నెలలు & 18 నెలలు నుంచి 2 సంవత్సరాలు 7.10%
  • 2 సంవత్సరాలు నుంచి 30 నెలలు 7.20%
  • 30 నెలలు నుంచి 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు నుంచి 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు 7.00%

కెనరా బ్యాంక్..
ఇక కెనరా బ్యాంక్ విషయానికి వస్తే.. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. కొత్త సవరణ తర్వాత, సాధారణ ప్రజలకు ఏడు రోజుల నుంచి పదేళ్ల వరకు చేసుకునే డిపాజిట్లపై బ్యాంక్ 4 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందజేస్తుంది. సీనియర్ సిటిజన్లు ఈ డిపాజిట్లపై 4 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తుంది. ఈ వడ్డీ రేట్లు ఇప్పటికే అమలులో ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: ఇదో చెత్త కారు.. రూ. 4 కోట్ల మసెరటిపై గౌతమ్ సింఘానియా ట్వీట్

  • 7 రోజుల నుంచి 45 రోజుల వరకు 4.00%
  • 46 రోజుల నుంచి 90 రోజుల వరకు 5.25%
  • 91 రోజుల నుంచి 179 రోజులు 5.50%
  • 180 రోజుల నుంచి 269 రోజుల వరకు 6.25%
  • 270 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ 6.50%
  • 1 సంవత్సరం మాత్రమే 6.90%
  • 444 రోజులు 7.25%
  • 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ 6.90%
  • 2 సంవత్సరాలు & అంతకంటే ఎక్కువ నుండి 3 సంవత్సరాల కంటే తక్కువ 6.85%
  • 3 సంవత్సరాలు & అంతకంటే ఎక్కువ - 5 సంవత్సరాల కంటే తక్కువ 6.80%
  • 5 సంవత్సరాలు & అంతకంటే ఎక్కువ - 10 సంవత్సరాల వరకు 6.70%

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)