Breaking News

ఆ టైమ్‌లో ఫుడ్ ఆర్డర్ చేయకండి.. జొమాటో రిక్వెస్ట్

Published on Mon, 06/03/2024 - 09:20

ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జోమాటో తన కస్టమర్‌లు మధ్యాహ్న సమయాల్లో ఫుడ్ ఆర్డర్ చేయకుండా ఉండమని కోరింది. దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. హీట్‌వేవ్ పరిస్థితుల్లో ఫుడ్ డెలివరీ బాయ్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని జొమాటో తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేస్తూ.. దయచేసి మధ్యాహ్న సమయాల్లో తప్పనిసరిగా అవసరమైతే తప్పా.. ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవద్దని విన్నవించింది.

ఇప్పుడు దేశంలో అక్కడక్కడా చిరుజల్లులు పడుతున్నప్పటికీ.. ఇంకా కొన్ని రోజులు వేడి తీవ్రత భారీగా ఉంటుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు తమ బైక్‌లపై తిరుగుతూ తీవ్రమైన ఎండ వేడిని తట్టుకోలేకపోతున్నారు, ఈ కారణంగానే జొమాటో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

జొమాటో విన్నపానికి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. లంచ్ సమయంలో కస్టమర్లు ఫుడ్ ఆర్డర్ చేయకుండా ఉండలేరని కొందరు పేర్కొన్నారు. మరి కొందరు మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు మీ వ్యాపారాన్ని క్లోజ్ చేయండి అని సలహా ఇచ్చారు. మరికొందరు లంచ్‌టైమ్ ఆర్డర్‌లను డిన్నర్ సమయానికి వాయిదా వేయలేమని అన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)