Breaking News

16 రోజుల్లో ఐటీ రీఫండ్స్ చెల్లింపులు

Published on Sat, 06/03/2023 - 08:10

న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు తిరిగి చెల్లింపులను (రిఫండ్‌) సగటున 16 రోజుల్లో పూర్తి చేస్తోంది. 2022–23 సంవత్సరాలో సగటు రిఫండ్‌ సమయం 16 రోజులకు తగ్గినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. 80 శాతం రిఫండ్‌లను రిటర్నులు దాఖలు చేసిన 30 రోజుల్లోనే విడుదల చేసినట్టు సీబీడీటీ చైర్మన్‌ నితిన్‌ గుప్తా తెలిపారు.

పన్ను చెల్లింపుదారులు సులభంగా, వేగంగా రిటర్నులు దాఖలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఐటీఆర్‌ దాఖలు చేసిన ఒక్కరోజులోనే వాటిని ప్రాసెస్‌ చేస్తున్నట్టు తెలిపారు. ఇలా ఒక్క రోజులో ప్రాసెస్‌ చేసినవి 2021–22లో 21 శాతం ఉంటే, 2022–23లో 42 శాతానికి పెరిగినట్టు వెల్లడించారు. టెక్నాలజీ సామర్థ్యం గురించి మాట్లాడుతూ.. 2022 జూన్‌ 28న ఒకే రోజు 22.94 లక్షల రిటర్నుల ప్రాసెసింగ్‌ నమోదైనట్టు పేర్కొన్నారు.

స్వచ్ఛంద నిబంధనల అమలును సులభతరం చేసేందుకు వీలుగా.. పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను సంబంధిత అసెస్‌మెంట్‌ సంవత్సరం ముగిసిన రెండేళ్ల వరకు ఎప్పుడైనా అప్‌డేట్‌ చేసుకునే సదుపాయం కల్పించినట్టు చెప్పారు. 2023 మార్చి 31 నాటికి 24.50 లక్షల అప్‌డేటెడ్‌ రిటర్నులు నమోదైనట్టు వెల్లడించారు.    

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)