Breaking News

ఆగని ఉద్యోగాల కోత! ఆ సంస్థ నుంచి మళ్ళీ 340 మంది..

Published on Sat, 05/13/2023 - 15:08

కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను భారీగా తొలగించింది. ఆ ప్రభావం ఇప్పటికి కూడా ఉద్యోగులపైన అలాగే ఉందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన మరో కంపెనీ తాజాగా సుమారు 30 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం.. అమెరికాకు చెందిన అటానమస్ డెలివరీ రోబోట్ స్టార్టప్ న్యూరో తన క్యాపిటల్ రన్‌వేను మరింత విస్తరించడానికి 30 శాతం మంది లేదా 340 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిపింది. గత వారంలో న్యూరో కో-ఫౌండర్స్ 'డేవ్ ఫెర్గూసన్ అండ్  జియాజున్ ఝూ' మాట్లాడుతూ.. కంపెనీ సిబ్బందిని తగ్గించి వనరులను వాణిజ్య కార్యకలాపాల నుంచి రీసర్చ్ & డెవెలప్మెంట్ వైపు మారుస్తున్నట్లు ప్రకటించారు.

ఈ ఏడాది కంపెనీ తమ మూడవ జనరేషన్ డెలివరీ రోబోట్స్ వాణిజ్య కార్యకలాపాలను పెంచడంతో పాటు వాల్యూమ్ ఉత్పత్తిని ఆలస్యం చేయడానికి తమ ప్రణాళికలను ఫాజ్ చేస్తుంది. ఈ మార్పుల వల్ల కంపెనీ మునుపటికంటే రెండు రెట్లు ఎక్కువ పని చేసే అవకాశం ఉంది.

(ఇదీ చదవండి: Apna Founder Success Story: వారెవ్వా.. 21 నెలలు, రూ. 9000 కోట్లు - జీవితాన్ని మార్చేసిన ఒక్క యాప్!)

గతంలో కూడా కంపెనీ అటానమస్ సిస్టం అభివృద్ధి చేసింది. దీని కోసం కస్టమ్ వెహికల్స్ కూడా రూపొందించింది. అయితే ఈ కొత్త విధానం న్యూరో ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేసే అవకాశం ఉందని బలంగా భావిస్తున్నారు. వ్యయాలను తగ్గించుకోవడంతో పాటు క్యాపిటల్ రన్‌వేను విస్తరించుకోవడం కోసం ఉద్యోగులను తొలగించింది. కంపెనీ ఉద్యోగులను తొలగించడం ఇది రెండవ సారి.

కంపెనీ గత ఏడాది నవంబర్ నెలలో కూడా సుమారు 20 శాతం లేదా 300 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే ఇప్పుడు మరో సారి ఉద్యోగాల కోతలు సుమారు 340 మంది ఉద్యోగులపైన ప్రభావం చూపుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)