తగ్గుతున్న ఏటీఎంలు

Published on Tue, 12/30/2025 - 06:32

ముంబై: డిజిటల్‌ చెల్లింపుల నేపథ్యంలో ఆటోమేటెడ్‌ టెల్లర్‌ మెషిన్లు (ఏటీఎంలు) తగ్గుముఖం పడుతున్నాయి. 2024 మార్చి నాటికి 2,53,417 ఏటీఎంలు దేశవ్యాప్తంగా ఉంటే, 2025 మార్చి చివరికి 2,51,057కు తగ్గినట్టు ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది. అంటే గత ఆర్థిక సంవత్సరంలో 2,360 ఏటీఎం మెషిన్లు తగ్గినట్టు తెలుస్తోంది. ఇదే కాలంలో బ్యాంక్‌ శాఖల సంఖ్య 2.8 శాతం పెరిగి 2025 మార్చి చివరికి 1.64 లక్షలకు చేరినట్టు తెలిపింది. 

ప్రైవేటు బ్యాంక్‌ల ఏటీఎంలు 79,884 నుంచి 77,117కు తగ్గాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌ల ఏటీఎంలు 1,34,694 నుంచి 1,33,544కు తగ్గాయి. డిజిటల్‌ చెల్లింపులు పెరగడంతో ఏటీఎంల్లో కస్టమర్ల లావాదేవీలు తగ్గినట్టు ఆర్‌బీఐ నివేదిక తెలిపింది. ఇక వైట్‌ లేబుల్‌ ఏటీఎంలు (స్వతంత్ర సంస్థలు నిర్వహించే) మాత్రం 34,602 నుంచి 36,216కు పెరిగాయి.

ప్రైవేటు, విదేశీ బ్యాంకుల ఏటీఎంలు ప్రధానంగా పట్టణాల్లో ఎక్కువగా ఉంటే, ప్రభుత్వరంగ బ్యాంక్‌ల ఏటీఎంలు మాత్రం పట్టణాలతో పాటు గ్రామీణ పట్టణాల్లోనూ విస్తరించి ఉన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు గత ఆర్థిక సంవత్సరంలో కొత్త శాఖల్లో మూడింట రెండొంతులు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేశాయి. కానీ, ప్రైవేటు బ్యాంకులు కొత్త శాఖల్లో మూడింట ఒక వంతు గ్రామీణ ప్రాంతాలకు కేటాయించాయి. బేసిక్‌ సేవింగ్స్‌ ఖాతాల సంఖ్య 2.6 శాతం పెరిగి 72.4 కోట్లకు చేరింది. ఖాతాల్లోని బ్యాలన్స్‌ 9.5 శాతం పెరిగి రూ.3.3 లక్ష లక్షల కోట్లకు చేరుకున్నట్టు ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)