Breaking News

వాహనాలకు  డిమాండ్‌ డౌన్‌

Published on Sat, 03/08/2025 - 05:37

న్యూఢిల్లీ: వాహనాలకు డిమాండ్‌ తగ్గిన నేపథ్యంలో ఫిబ్రవరిలో ప్యాసింజర్‌ వాహనాలు, టూ వీలర్లు సహా ఆటోమొబైల్‌ రిటైల్‌ అమ్మకాలు 7 శాతం క్షీణించినట్లు ఆటోమొబైల్‌ డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. గతేడాది ఫిబ్రవరిలో 20,46,328 వాహన విక్రయాలు నమోదు కాగా తాజాగా గత నెల 18,99,196 యూనిట్లకు తగ్గాయి. ప్యాసింజర్‌ వాహనాల రిటైల్‌ విక్రయాలు 10 శాతం క్షీణించి 3,03,398 యూనిట్లకు పరిమితమయ్యాయి. 

టూ వీలర్ల విక్రయాలు 6 శాతం క్షీణించి 14,44,674 నుంచి 13,53,280 యూనిట్లకు తగ్గాయి. వాణిజ్య వాహనాలు 9 శాతం క్షీణించి 82,763 యూనిట్లకు, ట్రాక్టర్ల విక్రయాలు 14 శాతం తగ్గి 65,574 యూనిట్లకు పడిపోయాయి.  నిల్వలపరంగా సమతౌల్యత లేకపోవడం, ధరలపరంగా మార్పులు, వినియోగదారుల్లో బలహీన సెంటిమెంట్, ఎంక్వైరీలు తగ్గిపోవడం, రుణ లభ్యత పరిమిత స్థాయిలోనే ఉండటం తదితర అంశాలు అమ్మకాల క్షీణతకు కారణమైనట్లు ఫాడా పేర్కొంది. 

ఎంట్రీ లెవెల్‌ కేటగిరీలో మార్కెట్‌ సెంటిమెంట్‌ బలహీనంగా ఉండటం, కొనుక్కోవాలనుకునే ఆలోచన కొనుగోలు రూపం దాల్చడంలో జాప్యం జరుగుతుండటం, అలవికాని లక్ష్యాలు డీలర్లకు సమస్యాత్మకంగా ఉంటున్నాయని ఫాడా ప్రెసిడెంట్‌ సీఎస్‌ విఘ్నేశ్వర్‌ తెలిపారు. ఇదే విషయాన్ని తయారీ సంస్థలకు తెలియజేశారని, తమపై భారీ నిల్వల భారం మోపడాన్ని నివారించాలని కోరారని వివరించారు. మార్చిలో అమ్మకాలపై ఆశావహంగా ఉన్నప్పటికీ డీలర్లు కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం 50–52 రోజులకు సరిపడే నిల్వలు ఉంటున్నాయని పేర్కొన్నారు.   
 

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)