Breaking News

చేతులు మారుతున్న హౌసింగ్‌ బ్రోకరేజీ సంస్థ

Published on Sun, 07/27/2025 - 12:03

హౌసింగ్‌ బ్రోకరేజీ సంస్థ ‘ప్రాప్‌టైగర్‌’ను కొనుగోలు చేస్తున్నట్టు ఆరమ్‌ ప్రాప్‌టెక్‌ లిమిటెడ్‌ ప్రకటించింది. రూ.86.45 కోట్ల విలువ మేర షేర్లను జారీ చేయడం ద్వారా ఆస్ట్రేలియాకు చెందిన ఆర్‌ఈఏ గ్రూప్‌ నుంచి ప్రాప్‌టైగర్‌ను సొంతం చేసుకుంటున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా ఆర్‌ఈఏ ఇండియాకు ప్రిఫరెన్షియల్‌ షేర్లను జారీ చేయనున్నట్టు స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు వెల్లడించింది.

ప్రాప్‌టైగర్‌ మార్కెటింగ్‌ సర్వీసెస్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ 100 శాతం షేర్లను కొనుగోలు చేసేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపినట్టు పేర్కొంది. ఒక్కోటీ రూ.5 ముఖ విలువ కలిగిన 42,42,537 షేర్లను ఆర్‌ఈఏ ఇండియాకు జారీ చేయనున్నట్టు వెల్లడించింది. షేర్ల జారీ అనంతరం ఆరమ్‌ ప్రాప్‌టెక్‌లో ఆర్‌ఈఏ ఇండియాకు 5.54 శాతం వాటా లభించనుంది.

ప్రాప్‌టైగర్‌ నిర్వహణలో రియల్‌ ఎస్టేట్‌ ప్రకటనల పోర్టల్‌ అయిన హౌసింగ్‌ డాట్‌ కామ్‌ ఉండడం గమనార్హం. 2023–24లో హౌసింగ్‌ డాట్‌ కామ్‌ ఆదాయం రూ.101 కోట్లుగా ఉంది. ఆరమ్‌ ప్రాప్‌టెక్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగానికి సాఫ్ట్‌వేర్, టెక్నాలజీ పరిష్కారాలను అందిస్తుంటుంది.

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)