Breaking News

అరబిందో ఫార్మా లాభం రూ. 846 కోట్లు

Published on Fri, 02/07/2025 - 08:53

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా నికర లాభం రూ. 846 కోట్లుగా నమోదైంది. గత క్యూ3లో ఇది రూ. 940కోట్లు. మరోవైపు తాజాగా ఆదాయం రూ. 7,352 కోట్ల నుంచి రూ. 7,979 కోట్లకు చేరింది. త్రైమాసికాలవారీగా చూస్తే అత్యధిక ఆదాయాన్ని నమోదు చేసినట్లు కంపెనీ ఎండీ కె. నిత్యానంద రెడ్డి తెలిపారు.

కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ఇందుకు దోహదపడినట్లు ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తయారీ సామర్థ్యాలను మరింతగా మెరుగుపర్చుకోనున్నామని, స్పెషాలిటీ.. ఇంజెక్టబుల్స్‌ వ్యాపారాన్ని విస్తరించనున్నామని నిత్యానంద రెడ్డి వివరించారు. దీనితో లాభదాయకత చెప్పుకోతగ్గ స్థాయిలో మెరుగుపడుతుందని చెప్పారు.

సమీక్షాకాలంలో అమెరికా ఫార్ములేషన్‌ విభాగం సుమారు రెండు శాతం క్షీణించి రూ. 3,671 కోట్లుగా, యూరప్‌ ఫార్ములేషన్స్‌ 23 శాతం పెరిగి ఆదాయం రూ. 2,121 కోట్లుగా, గ్రోత్‌ మార్కెట్స్‌ విభాగం 39 శాతం వృద్ధితో రూ. 873 కోట్లుగా నమోదైంది.  పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై కంపెనీ రూ. 450 కోట్లు వెచ్చించింది.  బీఎస్‌ఈలో కంపెనీ షేరు స్వల్పంగా క్షీణించి రూ. 1,184.50 వద్ద క్లోజయ్యింది.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు