Breaking News

అరబిందో లాభం అదిరింది!

Published on Sun, 11/10/2024 - 12:09

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషధ తయారీలో ఉన్న అరబిందో ఫార్మా సెప్టెంబర్‌ త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.6 శాతం ఎగసి రూ.817 కోట్లు సాధించింది. ఎబిటా 11.6 శాతం దూసుకెళ్లి రూ.1,566 కోట్లు నమోదైంది. ఎబిటా మార్జిన్‌ 65 బేసిస్‌ పాయింట్లు మెరుగై 20.1 శాతంగా ఉంది. ఈపీఎస్‌ 9 శాతం వృద్ధి చెంది రూ.14 ఉంది. టర్నోవర్‌ 8 శాతం అధికమై రూ.7,796 కోట్లకు చేరింది.

మొత్తం ఫార్ములేషన్స్‌ ఆదాయం 11.3 శాతం వృద్ధి చెంది రూ.6,640 కోట్లు సాధించింది. మొత్తం ఏపీఐ టర్నోవర్‌ 0.9 శాతం క్షీణించి రూ.1,156 కోట్లకు వచ్చి చేరింది. యూఎస్‌ ఫార్ములేషన్స్‌ వ్యాపారం 4.3 శాతం పెరిగి రూ.3,530 కోట్లు, యూరప్‌ ఫార్ములేషన్స్‌ ఆదాయం 19% ఎగసి రూ.2,105 కోట్లను తాకింది. వృద్ధి మార్కెట్ల నుంచి ఆదాయం 44% దూసుకెళ్లి రూ.812 కోట్లకు చేరింది. పరిశోధన, అభివృద్ధికి చేసిన వ్యయాలు రూ.410 కోట్లు. ఇది ఆదాయంలో 5.3 శాతానికి సమానం.

సింహభాగం యూఎస్‌..
మొత్తం వ్యాపారంలో విదేశీ మార్కెట్ల వాటా ఏకంగా 89% ఉంది. టర్నోవర్‌లో యూఎస్‌ 45.3% తో  సింహభాగం వాటా కైవసం చేసుకుంది. యూరప్‌ 27%, ఏపీఐలు 14.8, వృద్ధి మార్కెట్లు 10.4, ఏఆర్‌వీ ఫార్ములేషన్స్‌ 2.5% వాటా దక్కించు కున్నాయి. ‘ఈ త్రైమాసికంలో కీలక వ్యాపార రంగాలలో రాబడుల నిరంతర వృద్ధితో సంతోషి స్తున్నాం. ఇది విభిన్న పోర్ట్‌ఫోలియో స్థితి స్థాపక తను ప్రతిబింబిస్తుంది. ప్రాథమికంగా కొన్ని వ్యా పార కార్యకలాపాల తాత్కాలిక స్వభావం కారణంగా లాభదాయకత స్వల్పంగా తగ్గినప్పటికీ, అంతర్లీన పనితీరు బలంగా ఉంది. బలమైన పునాది, కొనసాగుతున్న కార్యాచరణ మెరుగు దలలతో వృద్ధి పథాన్ని కొనసాగించగలమని, ప్రస్తుత సంవత్సరానికి వ్యూహాత్మక లక్ష్యాలను సాధించగ లమని విశ్వసిస్తున్నాం’ అని అరబిందో ఫార్మా వైస్‌ చైర్మన్, ఎండీ కె.నిత్యానంద రెడ్డి తెలిపారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)