Breaking News

‘తాజ్ బంజారా’ను కొనేసిన అరబిందో

Published on Wed, 12/10/2025 - 14:37

హైదరాబాద్: నగర రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో పెద్ద సంచలనం.. ప్రసిద్ధ స్టార్‌ హోటల్‌ ‘తాజ్‌ బంజారా’ చేతులు మారింది. అరోబిందో గ్రూప్‌కి చెందిన ఆరో రియాల్టీ తాజ్ బంజారా హోటల్‌ను రూ.315 కోట్లకు అధికారికంగా కొనుగోలు చేసింది.

గత అక్టోబర్ 31న పూర్తైన ఈ లావాదేవీ బంజారాహిల్స్ వంటి ప్రీమియం ప్రాంతంలో జరిగిన అత్యంత ముఖ్యమైన డీల్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ కొనుగోలుకు స్టాంప్ డ్యూటీ కింద రూ.17.3 కోట్లు చెల్లించినట్లు సమాచారం. సుమారు 3.5 ఎకరాల్లో ఉ‍న్న తాజ్ బంజారా మొత్తం విస్తీర్ణం 16,645 చదరపు గజాలు. ఇందులో బిల్ట్-అప్ ఏరియా 1.22 లక్ష చదరపు అడుగులు. ఈ హోటల్‌లో మొత్తం 270పైగా గదులు ఉన్నాయి.

ఐకానిక్ తాజ్ బంజారా

ఒకప్పుడు తాజ్ గ్రూప్‌కి చెందిన ఫ్లాగ్‌షిప్ లగ్జరీ హోటల్‌గా తాజ్ బంజారా ప్రత్యేకమైన ప్రాధాన్యం కలిగిన హోటల్‌గా నిలిచింది. అయితే గత కొన్నేళ్లుగా ఆపరేషనల్ సమస్యలు, జీహెచ్‌ఎంసీ నుంచి క్లోజర్ నోటీసులు అందుకోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంది. ఈ కొనుగోలు తర్వాత ఆ ప్రాపర్టీ పునర్వ్యవస్థీకరణకు అవకాశాలు ఉన్నాయి.

ఆరో రియాల్టీ ఏం చేస్తుందో..

హైదరాబాద్‌లో భారీగా విస్తరిస్తున్న ఆరొ రియాల్టీ, రెసిడెన్షియల్, కమర్షియల్, మిక్స్‌డ్-యూజ్ సెగ్మెంట్‌ల్లో నిరంతరం పెద్ద ప్రాజెక్టులు చేపడుతోంది. ఇప్పుడు తాజ్ బంజారా కొనుగోలు ఆ విస్తరణలో కీలకమైన మైలురాయిగా నిలిచింది. కాగా దీంతో ఆతిథ్య రంగంలోకి ప్రవేశించి తాజ్‌ బంజారా హోటల్‌ను కొనసాగిస్తుందా.. లేదా కూల్చేసి హై-ఎండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌కు తెరతీస్తుందా అన్నది చూడాలి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)