ఆగస్టులో రిజిస్ట్రేషన్లు‘ భూమ్‌’! టాప్‌-5 లిస్ట్‌ ఇదే!

Published on Sat, 09/16/2023 - 10:14

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ పరుగులు పెడుతుంది. గత నెలలో రూ.3,461 కోట్లు విలువ చేసే 6,493 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్స్‌ అయ్యాయి. ఈ ఏడాది ఈ స్థాయిలో రిజిస్ట్రేషన్స్‌ జరగడం ఇది రెండోసారి. మార్చిలో అత్యధికంగా 6,959 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్స్‌ జరిగాయి. జూలై నెలతో పోలిస్తే రిజిస్ట్రేషన్స్‌లో 17 శాతం, ఏడాది కాలంతో పోలిస్తే 15 శాతం ఎక్కువని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. ప్రాపర్టీల విలువల పరంగా చూస్తే జూలైతో పోలిస్తే 20 శాతం, ఏడాది కాలంతో పోలిస్తే 22 శాతం ఎక్కువ.  (ఎస్‌బీఐ మాజీ చైర్మన్‌ రజనీష్‌ సంపాదన ఎంతో తెలిస్తే!)

68 శాతం వాటా ఈ గృహాలదే.. 
ఆగస్టులో జరిగిన రిజిస్ట్రేషన్లలో అత్యధిక వాటా రూ.50 లక్షల లోపు గృహాలదే. ఈ ఇళ్ల వాటా 68 శాతంగా ఉంది. విభాగాల వారీగా చూస్తే.. రూ.25 లక్షలు లోపు ధర ఉన్న ప్రాపర్టీల వాటా 16 శాతం కాగా.. రూ.25-50 లక్షలు మధ్య ధర ఉన్న ప్రాపర్టీల వాటా 52 శాతం, రూ.50-75 లక్షలవి రూ.16 శాతం, రూ.75 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్నవి 8 శాతం, రూ.కోటి నుంచి రూ.2 కోట్లు ధర ఉన్నవి 7 శాతం, రూ.2 కోట్లకు మించి ధర ఉన్న ప్రాపర్టీల వాటా 2 శాతంగా ఉంది. 

2 వేల చ.అ. లోపు విస్తీర్ణ ఇళ్లు... 
♦ గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో 1,000 చ.అ. నుంచి 2,000 చ.అ. మధ్య విస్తీర్ణం ఉన్న ప్రాపర్టీ వాటా 70 శాతంగా ఉంది. 2 వేల నుంచి 3 వేల చ.అ. మధ్య ఉన్న ఇళ్ల వాటా 9 శాతం, 3 వేల చ.అ. కంటే ఎక్కువ విస్తీర్ణమైన యూనిట్ల వాటా 2 శాతంగా ఉంది. 
♦   అత్యధిక రిజిస్ట్రేషన్లు మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలోనే జరిగాయి. ఈ జిల్లా వాటా 43 శాతం ఉండగా.. రంగారెడ్డిలో 39 శాతం, హైదరాబాద్‌లో 17 శాతం రిజిస్ట్రేషన్‌ వాటాను కలిగి ఉన్నాయి. 

టాప్‌-5 రిజిస్ట్రేషన్లన్స్‌ ఇవే.. 
ఆగస్టులో జరిగిన రిజిస్ట్రేషన్లలో టాప్‌–5 జాబితాలో  బేగంపేట, బంజారాహిల్స్, ఖైరతాబాద్‌ ప్రాంతాలలోని ప్రాపర్టీలు నిలిచాయి. అత్యధికంగా బేగంపేటలో రూ. 8.20 కోట్ల మార్కెట్‌ విలువ గల రిజిస్ట్రేషన్‌ జరగగా.. ఆ తర్వాత బంజారాహిల్స్‌లో రూ.7.47 కోట్లు, రూ.5.60 కోట్లు, రూ.5.60 కోట్ల ప్రాపర్టీలు, ఖైరతాబాద్‌లో రూ.4.76 కోట్ల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌ జరిగింది. ఆయా యూనిట్ల విస్తీర్ణం 3 వేల చ.అ.లకు మించి ఉన్నవే. 

Videos

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)