Breaking News

మీకు తెలుసా.. ఈ ఆడి కార్ల ధరలు పెరగనున్నాయ్!

Published on Tue, 04/11/2023 - 21:36

భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన జర్మన్ బ్రాండ్ 'ఆడి' 2023 మే 01 నుంచి తన వాహనాల ధరలను పెంచనున్నట్లు తెలిపింది. కస్టమ్స్ డ్యూటీ అండ్ ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆడి క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ ధరలు వచ్చే నెల ప్రారభం నుంచి 1.6 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సంస్థ ప్రకటించింది. ఇప్పటికే క్యూ8 సెలబ్రేషన్, ఆర్‌ఎస్ 5, ఎస్ 5 ధరలు ఈ నెల ప్రారంభం నుంచి పెరిగిన విషయం అందరికి తెలిసిందే. కాగా వచ్చే నెల ప్రారంభం నుంచి మరో రెండు మోడల్స్ ధరలు పెరుగుతాయి.

ఆడి కంపెనీ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అత్యాధునిక కార్లను విడుదల చేసి మంచి అమ్మకాలను పొందుతోంది. అయితే ఇప్పుడు ధరల పెరుగుదల కొనుగోలుదారులపైన కొంత ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. అయితే కొత్త ధరలు త్వరలోనే వెల్లడవుతాయని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ ఒక ప్రకటనలో తెలిపారు.

కంపెనీ వివిధ స్థాయిలలో ధరల ప్రభావాన్ని కస్టమర్ల మీద పడకుండా చూడటానికి ప్రయత్నించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితి ధరలను పెంచాల్సిన అవసరం తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ కూడా వివిధ మోడళ్ల ధరలను ఏప్రిల్ 01 నుంచి రూ. 2 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు పెంచింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)