Breaking News

కొనాలన్నా.. ఈ రెండు కార్లు దొరకవు!

Published on Sat, 02/15/2025 - 21:08

ఇండియన్ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందిన.. ఆడి (Audi) కంపెనీ రెండు కార్లను వెబ్‌సైట్ నుంచి తొలగించింది. ఇందులో ఏ8ఎల్, ఆర్ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్ ఉన్నాయి. ఈ రెండు కార్లు భారతదేశానికి సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారానే వచ్చాయి. ఆడి ఏ8 ఎల్ భారతదేశంలో 2020లో లాంచ్ అయింది, ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ 2021 నుంచి అమ్మకానికి ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 1.63 కోట్లు, రూ. 1.13 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా).

నాల్గవ తరం ఆడి ఏ8 ఎల్ 2017 నుంచి గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే 2020లో భారతదేశానికి వచ్చింది. ఆ తరువాత 2022లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ రూపంలో లాంచ్ అయింది. ఏ8 ఎల్ నాలుగు, ఐదు సీట్ల కాన్ఫిగరేషన్‌లలో.. సౌకర్యవంతమైన రియర్ సీటు పొందుతుంది. ఇందులోని 3.0 లీటర్ TFSI వీ6 టర్బో పెట్రోల్ ఇంజిన్.. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.

ఇక ఆడి ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ విషయానికి వస్తే.. ఇది ఆగస్టు 2021లో ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైంది. ఇందులోని 2.9 లీటర్ ట్విన్ టర్బో వీ6 ఇంజిన్ 450 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఏ8 మాదిరిగానే ఇది కూడా వెబ్‌సైట్ నుంచి కనుమరుగైంది. కాగా కంపెనీ ఫిబ్రవరి 17న భారతదేశంలో RS Q8 ఫేస్‌లిఫ్ట్‌ లాంచ్ చేసే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: బుకింగ్స్‌లో కనీవినీ ఎరుగని రికార్డ్!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)