Breaking News

ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌కు ‘బ్యాంకింగ్‌’ లైసెన్స్‌

Published on Fri, 08/08/2025 - 08:22

యూనివర్సల్‌ బ్యాంకు (పూర్తి స్థాయి బ్యాంకు)గా కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించింది. ఆర్‌బీఐ మార్గ దర్శకాలకు అనుగుణంగా 2024 సెపె్టంబర్‌ 3న ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ యూనివర్సల్‌ బ్యాంకింగ్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. అర్హత ప్రమాణాలు పరిశీలించిన ఆర్‌బీఐ తాజాగా దీన్ని మంజూరు చేసింది. దీంతో ఆర్‌బీఐ నుంచి పూర్తి స్థాయి బ్యాంకింగ్‌ లైసెన్స్‌ పొందిన తొలి స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుగా అవతరించింది.

ఇదీ చదవండి: కరెంట్‌ బిల్లు పరిధి దాటితే ఐటీఆర్‌ ఫైల్‌ చేయాల్సిందే!

బ్యాంకు ఎండీ సీఈవో సంజయ్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. ‘యూనివర్సల్‌ బ్యాంక్‌గా కార్యకపాలు నిర్వహించుకునేందుకు ఆర్‌బీఐ నుంచి సూత్రప్రాయంగా ఆమోదం పొందడం ద్వారా చరిత్ర సృష్టించాం. వ్యాపార విస్తరణ సామర్థ్యాన్ని పెంచుకోవడమే కాకుండా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం’ అన్నారు. దాదాపు దశాబ్దకాలం తర్వాత మళ్లీ ఆర్‌బీఐ యూనివర్సల్‌ బ్యాంకింగ్‌ లైసెన్స్‌ ఇవ్వడం ఇదే తొలిసారి. అంతక్రితం 2014 ఏప్రిల్‌లో బంధన్‌ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ (ప్రస్తుతం ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌)లకు ఆర్‌బీఐ బ్యాంకింగ్‌ లైసెన్స్‌ మంజూరు చేసింది.
 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)