Breaking News

‘రేర్‌ ఎర్త్‌’ రీసైక్లింగ్‌పై రూ.100 కోట్ల పెట్టుబడులు

Published on Fri, 06/20/2025 - 10:05

రేర్‌ ఎర్త్‌ లోహాల (ఆర్‌ఈఈ) రీసైక్లింగ్‌ సామర్థ్యాలను వచ్చే ఏడాది, రెండేళ్ల వ్యవధిలో 30,000 టన్నులకు పెంచుకోవాలని ఈ–వేస్ట్‌ రీసైక్లింగ్‌ కంపెనీ అటెరో నిర్దేశించుకుంది. ఇందుకోసం రూ.100 కోట్లు ఇన్వెస్ట్‌ చేసే ప్రణాళికలు ఉన్నట్లు సంస్థ సీఈవో నితిన్‌ గుప్తా తెలిపారు. ప్రస్తుతం కంపెనీకి 300 టన్నుల సామర్థ్యం ఉంది. ఎల్రక్టానిక్స్, ఆటోమొబైల్, ఇతర టెక్నాలజీ ఉత్పత్తుల తయారీలో రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ కీలకంగా ఉంటాయి. నియోడైమియం, ప్రసియోడైమియం, డిస్‌ప్రోజియంలాంటి అరుదైన ఖనిజాల వెలికితీతపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు గుప్తా వివరించారు.

ఇదీ చదవండి: బ్యాటరీ సేవ్‌ చేసే డిస్‌ప్లే.. యాపిల్‌ కసరత్తు

కీలకమైన ఖనిజాల కోసం దిగుమతులపై ఆధారపడకుండా భారత్‌ స్వయం సమృద్ధి సాధించాలనేది తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఆర్‌ఈఈ మార్కెట్‌ 2029 నాటికి ఆర్‌ఈఈ మార్కెట్‌ ఏటా 12.6 శాతం వార్షిక వృద్ధితో 10.9 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని, ఆర్‌ఈఈ మ్యాగ్నెట్ల మార్కెట్‌ 2033 నాటికి 30.3 బిలియన్‌ డాలర్ల స్థాయిని దాటొచ్చని అంచనాలు నెలకొన్నాయి. అటెరోకి 46 గ్లోబల్‌ పేటెంట్లు ఉన్నాయి. అమెరికా, యూరప్‌లో కార్యకలాపాలను విస్తరించే యోచనలో ఉంది.

#

Tags : 1

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)