Breaking News

ఏథర్‌ ఐపీవో: ఒక్కో షేర్‌ ధర ఎంతంటే..

Published on Thu, 04/24/2025 - 09:40

ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన కంపెనీ ఏథర్‌ ఎనర్జీ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 304–321 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 28న ప్రారంభమై 30న ముగియనుంది. దీనిలో భాగంగా రూ. 2,626 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.1 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.

తద్వారా రూ. 2,981 కోట్లు సమీకరించనుంది. వెరసి కొత్త ఆర్థిక సంవత్సరం(2025–26)లో తొలి పబ్లిక్‌ ఇష్యూగా నిలవనుంది.  ఈ ఇష్యూలో ఒక్కో షేర్‌ ముఖ విలువ రూ.1గా ఉంటుంది. ఒ‍క్కో ఇన్వెస్టర్‌ కనీసం 46 షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

యాంకర్‌ ఇన్వెస్టర్లకు ఏప్రిల్‌ 25నే బిడ్డింగ్‌ ప్రారంభం కానుంది. ఇక తమ ఉద్యోగులకు లక్ష షేర్ల వరకూ కేటాయించిన ఏథర్‌.. వారికి ఒక్కో షేర్‌పై రూ.30 తగ్గింపు అందిస్తోంది. ఐపీవో ద్వారా దేశీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో గతేడాది ఆగస్ట్‌లో లిస్టయిన ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ తదుపరి రెండో ద్విచక్ర ఈవీ కంపెనీగా ఏథర్‌ నిలవనుంది.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)