Breaking News

నేటి నుంచి ఏథర్‌ ఐపీవో 

Published on Mon, 04/28/2025 - 06:01

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన కంపెనీ ఏథర్‌ ఎనర్జీ పబ్లిక్‌ ఇష్యూ నేడు(28న) ప్రారంభంకానుంది. 30న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 304–321కాగా.. యాంకర్‌ ఇన్వెస్టర్లకు షేరుకి రూ. 321 ధరలో 4.17 కోట్ల షేర్లను కేటాయించింది. తద్వారా రూ. 1,340 కోట్లు అందుకుంది. మ్యూచువల్‌ ఫండ్స్‌సహా 36 సంస్థలు ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. ఇష్యూలో భాగంగా రూ. 2,626 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. 

వీటికి జతగా మరో 1.1 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా మొత్తం రూ. 2,981 కోట్లు సమకూర్చుకోనుంది. వెరసి కొత్త ఆర్థిక సంవత్సరం (2025–26)లో తొలి పబ్లిక్‌ ఇష్యూగా నిలవనుంది. ఐపీవో ద్వారా మహారాష్ట్రలో ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులను సమీకరించాలని భావిస్తోంది. 

రుణ చెల్లింపులకూ నిధులను వెచ్చించనుంది. ఐపీవో ద్వారా దేశీ స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో గతేడాది ఆగస్ట్‌లో లిస్టయిన ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ తదుపరి రెండో ద్విచక్ర ఈవీ కంపెనీగా ఏథర్‌ నిలవనుంది. ఓలా ఎలక్ట్రిక్‌ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 6,145 కోట్లు అందుకున్న విషయం విదితమే. మొత్తం రూ. 11,956 కోట్ల విలువలో ఏథర్‌ ఎనర్జీ ఐపీవోకు వస్తోంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 46 షేర్లకు(ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్లవరకూ దరఖాస్తుకు వీలుంటుంది. షేర్ల కేటాయింపు మే 2న ఉండవచ్చు. స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో 6న లిస్టయ్యే వీలుంది.

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)