Breaking News

ఏషియన్‌ పెయింట్స్‌ లాభం డౌన్‌

Published on Fri, 05/09/2025 - 05:52

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఏషియన్‌ పెయింట్స్‌ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 45 శాతం క్షీణించి రూ. 701 కోట్లకు పరిమితమైంది. డిమాండ్‌ తగ్గడంతోపాటు, పోటీ తీవ్రత ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,275 కోట్లు ఆర్జించింది.

మొత్తం ఆదాయం సైతం రూ. 8,731 కోట్ల నుంచి రూ. 8,359 కోట్లకు స్వల్పంగా(4 శాతం) వెనకడుగు వేసింది. మొత్తం వ్యయాలు రూ. 7,277 కోట్లుగా నమోదయ్యాయి. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 20.55 చొప్పున తుది డివిడెండ్‌ ప్రకటించింది.  

విదేశీ అమ్మకాలు వీక్‌ 
క్యూ4లో ఇతర ఆదాయంతో కలిపి ఏషియన్‌ పెయింట్స్‌ మొత్తం టర్నోవర్‌ 5 శాతం తక్కువగా రూ. 8,459 కోట్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయాలు 2 శాతం నీరసించి రూ. 800 కోట్లకు పరిమితమయ్యాయి. ఇథియోపియా, ఈజిప్‌్టలలో కరెన్సీ విలువ క్షీణించడం, బంగ్లాదేశ్‌లో ఆర్థిక సవాళ్లు ఇందుకు కారణమైనట్లు కంపెనీ ఎండీ, సీఈవో అమిత్‌ సింగ్లే పేర్కొన్నారు. 
ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్‌ఈలో 1.3 శాతం బలహీనపడి రూ. 2,303 వద్ద ముగిసింది. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)