ఏషియన్‌ పెయింట్స్‌పై విచారణకు సీసీఐ ఆదేశం

Published on Wed, 07/02/2025 - 08:13

న్యూఢిల్లీ: డెకొరేటివ్‌ పెయింట్ల తయారీ, విక్రయ మార్కెట్లో ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ ఏషియన్‌ పెయింట్స్‌పై వస్తున్న ఆరోపణలపై కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) విచారణకు ఆదేశించింది. 90 రోజుల వ్యవధిలో నివేదికను సమరి్పంచాలని డైరెక్టర్‌ జనరల్‌కు సూచించింది.

డెకొరేటివ్‌ పెయింట్స్‌ విభాగంలో కొత్త సంస్థల రాకుండా అడ్డుకుంటూ, పరిశ్రమ వృద్ధి అవరోధాలు సృష్టించే విధానాలు పాటిస్తోందంటూ ఏషియన్‌ పెయింట్స్‌పై గ్రాసిం ఇండస్ట్రీస్‌ (బిర్లా పెయింట్స్‌ డివిజన్‌) చేసిన ఫిర్యాదు మేరకు సీసీఐ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. 

గ్రాసింలాంటి పోటీ సంస్థలతో లావాదేవీలు జరపకుండా డీలర్లకు ఆంక్షలు విధించడం, ముడి సరుకులు..సేవలు అందించకుండా నిరోధించడంలాంటి అంశాలు చూస్తే కొత్త సంస్థలను మార్కెట్లోకి రాకుండా ఆటంకాలు కల్పించడంతో పాటు మార్కెట్లో పోటీపై ఏషియన్‌ పెయింట్స్‌ ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోందని సీసీఐ పేర్కొంది. ఆదిత్య బిర్లా గ్రూప్‌లో భాగమైన గ్రాసిం గతేడాది ఫిబ్రవరిలో ’బిర్లా ఓపస్‌ పెయింట్స్‌’ పేరిట డెకొరేటివ్‌ పెయింట్స్‌ విభాగంలోకి ప్రవేశించింది.    

#

Tags : 1

Videos

LIVE: జన హృదయ నేతకు YS జగన్ నివాళి

మహానేత YSRకు వైఎస్ జగన్ ఘన నివాళి

వల్లభనేని వంశీకి అస్వస్థత

వైఎస్ జగన్ @పులివెందుల

బిహార్ ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్

అక్బరుద్దీన్ ఓవైసీ కళాశాలల జోలికి పోతే అన్యాయం జరుగుతుందట: బండి సంజయ్

Psycho Attack: టెంపుల్ సిటీ తిరుపతిలో దారుణం

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో YSRCP విస్తృతస్థాయి సమావేశం

కూటమి ప్రభుత్వానికి ప్రజలు త్వరలో బుద్ధి చెప్తారు: YSRCP నేతలు

పాతాళం నుంచి ఆకాశమంత ఎదిగిన ఆకాశ్ దీప్

Photos

+5

మరుపురాని మహానేతకు ఘన నివాళి (ఫొటోలు)

+5

వైఎస్సార్‌.. అరుదైన చిత్రమాలిక

+5

ఉల్లి... వెల్లుల్లి.. తల్లి!.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు (ఫొటోలు)

+5

పులివెందులలో వైఎస్‌ జగన్‌.. పోటెత్తిన అభిమానం

+5

విష్ణు విశాల్- గుత్తా జ్వాలా కుమార్తెకు పేరు పెట్టిన అమిర్ ఖాన్.. ఫోటోలు

+5

హీరోయిన్‌గా మిత్రా శర్మ.. ఎంతందంగా ఉందో! (ఫోటోలు)

+5

మాదాపూర్ లో 'టీటా' బోనాలు (ఫొటోలు)

+5

RK Sagar : ‘ది 100’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

నెల్లూరులో ఘనంగా మొదలైన రొట్టెల పండగ..పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)

+5

గూగూడు కుళ్లాయిస్వామి క్షేత్రం భక్తజన సాగరం (ఫొటోలు)