Breaking News

అశోక్‌ లేలాండ్‌ లాభం రూ.199 కోట్లు

Published on Sat, 11/12/2022 - 08:57

న్యూఢిల్లీ: అశోక్‌ లేలాండ్‌ సెప్టెంబర్‌ క్వార్టర్‌కు మెరుగైన ఫలితాలను ప్రకటించింది. రూ.199 కోట్ల లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.83 కోట్ల నష్టం రావడం గమనార్హం. ఆదాయం దాదాపు రెట్టింపై రూ.8,266 కోట్లుగా నమోదైంది.

 అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.4,458 కోట్లుగా ఉంది. దేశీ మార్కెట్లో మధ్య, భారీ స్థాయి వాణిజ్య విక్రయాలు 25,475 యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలం వీటి విక్రయాలు 11,988 యూనిట్లుగా ఉన్నాయి. మార్కెట్‌ వాటా 9.6 శాతంగా ఉంది. స్వల్ప స్థాయి వాణిజ్య వాహనాల విక్రయాలు 28 శాతం పెరిగి 17,040 యూనిట్లుగా ఉన్నా యి. ఎగుమతులు 25 శాతం పెరిగి 2,780 యూనిట్లుగా నమోదయ్యాయి. 

‘‘అంతర్జాతీయంగా మాంద్యం ధోరణలు ఉన్నా, దేశీ వాణిజ్య వాహన మార్కెట్లో వృద్ధి చక్కగా ఉంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మంచి విక్రయాలు పరిశ్రమ వ్యాప్తంగా నమోదయ్యాయి’’అని అశోక్‌లేలాండ్‌ చైర్మన్‌ ధీరజ్‌ హిందుజా తెలిపారు. మెరుగైన ఉత్పత్తులు, ప్రత్యామ్నాయ ఇంధన ఆధారిత భవిష్యత్తు ఉత్పత్తుల తయారీకి అవసరమైన సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటామని ప్రకటించారు.   
 

Videos

కడపలో పట్టుబడ్డ ఆఫ్గనిస్తాన్ సిటిజన్స్

పాకిస్థాన్ తో దౌత్య యుద్ధానికి భారత్ సిద్ధం

పాకిస్థాన్ తో దౌత్య యుద్ధానికి భారత్ సిద్ధం

Varudu Kalyan: లిక్కర్ స్కాం చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వమే

IAS, IPSల అరెస్టులు సరికావు.. అడ్వకేట్ సుదర్శన్ రెడ్డి

లిక్కర్ కేసు సృష్టికర్త చంద్రబాబే.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇది దుర్దినం

గెస్ట్ ఎంట్రీలతో స్క్రీన్ షేక్ చేస్తున్న స్టార్ హీరోస్!

ఠాగూర్ 2 రెడీ! మురుగదాస్ మాస్ ప్లాన్!

ఆ నలుగురు ఐఏఎస్ లదే రాజ్యం!

బాబుగారి యవ్వన రహస్యాలు

Photos

+5

#MissWorld2025 : పిల్లలమర్రిలో అందగత్తెల సందడి (ఫొటోలు)

+5

ముంబై వాంఖడేలో రో‘హిట్‌’ శర్మ స్టాండ్‌.. ఆనందంలో ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'బకాసుర రెస్టారెంట్' మూవీ ట్రైలర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

శ్రీవిష్ణు ‘#సింగిల్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో అందాల భామలు (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌: 13 ఏళ్లకే హీరోయిన్.. ఛార్మి జీవితాన్ని మార్చేసిన సినిమా ఏదంటే?

+5

ఈ తప్పులు చేస్తే EPF క్లెయిమ్‌ రిజెక్టే.. (ఫొటోలు)

+5

Miss World 2025 : ఎకో పార్క్ కు ప్రపంచ సుందరీమణులు (ఫొటోలు)

+5

'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' హీరో క్యూట్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

Subham Success Meet : శుభం సక్సెస్ మీట్ (ఫొటోలు)