Breaking News

అశోక్‌ లేలాండ్‌ బోనస్‌ షేర్లు

Published on Sat, 05/24/2025 - 07:40

ముంబై: వాణిజ్య వాహన రంగ దిగ్గజం అశోక్‌ లేలాండ్‌ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 33 శాతంపైగా జంప్‌చేసి రూ. 1,246 కోట్లను తాకింది. ఆదాయం పుంజుకోవడం ఇందుకు ప్రధానంగా సహకరించింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 934 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 13,542 కోట్ల నుంచి రూ. 14,696 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 12,037 కోట్ల నుంచి రూ. 13,097 కోట్లకు పెరిగాయి. 

ఈ నెల(మే) 22న చెల్లించిన(రెండో) రూ. 4.25 డివిడెండ్‌ను తుది డివిడెండ్‌గా ప్రకటించింది. మరోవైపు వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్ల జారీకి బోర్డు అనుమతించినట్లు వెల్లడించింది. దీంతో ప్రతీ షేరుకి మరో షేరుని ఉచితంగా జారీ చేయనుంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కంపెనీ నికర లాభం రూ. 2,696 కోట్ల నుంచి రూ. 3,383 కోట్లకు బలపడింది. మొత్తం ఆదాయం రూ. 45,703 కోట్ల నుంచి రూ. 48,535 కోట్లకు ఎగసింది. 

వెరసి క్యూ4తోపాటు పూర్తి ఏడాదిలో రికార్డ్‌ ఆదాయం సాధించినట్లు కంపెనీ చైర్మన్‌ ధీరజ్‌ హిందుజా పేర్కొన్నారు. గతేడాది మొత్తం వాణిజ్య వాహన విక్రయాలు 1,95,093 యూనిట్లను తాకాయి. కంపెనీ ఆర్థికంగా పటిష్టస్థితిలో ఉన్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో షేను అగర్వాల్‌ పేర్కొన్నారు. 2025 మార్చికల్లా రూ. 4,242 కోట్ల నగదు నిల్వలున్నట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్‌ఈలో 0.4 శాతం బలపడి రూ. 240 వద్ద ముగిసింది.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)