Breaking News

బ్యాటరీ తయారీలో అశోక్ లేలాండ్ రూ.5,000 కోట్ల పెట్టుబడులు

Published on Tue, 09/02/2025 - 12:59

భారత ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేసే దిశగా వాణిజ్య వాహనాల తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్ పెట్టుబడుల పెడుతోంది. వచ్చే 7 నుంచి 10 ఏళ్లలో తదుపరి తరం బ్యాటరీల అభివృద్ధి, తయారీ కోసం రూ.5,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్‌ చేయబోతున్నట్లు ప్రకటించింది. 

హిందూజా గ్రూప్ యాజమాన్యంలోని ఈ సంస్థ చైనా బ్యాటరీ టెక్నాలజీ లీడర్ సీఏఎల్‌బీ గ్రూప్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటం, భారత్‌లో బలమైన బ్యాటరీ సరఫరా గొలుసును నిర్మించడం లక్ష్యంగా ఈ సహకారం కుదిరినట్లు ఇరు వర్గాలు తెలిపాయి.

ఆటోమోటివ్, ఎనర్జీ స్టోరేజ్ అప్లికేషన్‌లు..

ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (ఈఎస్ఎస్)తో సహా ఆటోమోటివ్, నాన్ ఆటోమోటివ్ అప్లికేషన్‌లలో ఈ పెట్టుబడులు విస్తరించనున్నాయి. అశోక్ లేలాండ్ బ్యాటరీ ఉత్పత్తి విభాగంలోకి ప్రవేశించడంతో సొంత వాణిజ్య వాహన వ్యాపారానికి మద్దతుగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీని వేగవంతం చేయడానికి, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారతదేశంలో బ్యాటరీ సరఫరా గొలుసును సృష్టించే దిశగా సీఏఎల్‌బీతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఒక కీలక అడుగు అని అశోక్ లేలాండ్ ఛైర్మన్ ధీరజ్ హిందూజా అన్నారు. 

అశోక్ లేలాండ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ షెను అగర్వాల్ మాట్లాడుతూ.. ‘బ్యాటరీ వ్యాపారంలో ప్రాథమికంగా ఆటోమోటివ్ అప్లికేషన్లపై దృష్టి సారిస్తాం. తరువాత పారిశ్రామిక, నివాస ఎనర్జీ స్టోరేజ్‌ పరిష్కారాలతో సహా నాన్-ఆటోమోటివ్ రంగాలకు ప్రణాళికాబద్ధంగా విస్తరిస్తాం’ అన్నారు.

ఇదీ చదవండి: ఒకే కంపెనీలో 25 ఏళ్లు అనుభవం.. తీరా చూస్తే..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)