Breaking News

Ashneer Grover : ఎన్నాళ్లు ఇలా ప్రభుత్వాలకు ఊడిగం చేయాలి? :

Published on Mon, 06/12/2023 - 19:39

విదేశాల్లో అంతర్జాతీయ క్రెడిట్‌ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై కేంద్రం టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) ను వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కొత్త పన్ను విధానాన్ని, అందులోని లోపాల్ని భారత్‌ పే మాజీ సహ వ్యవస్థాపకులు అశ్నీర్‌ గ్రోవర్‌ విమర్శిస్తూ వస్తున్నారు. 

తాజాగా, మరో సారి ట్యాక్స్‌ పేయర్లు ప్రభుత్వాలకు ఊడిగం చేస్తున్నారంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పైగా పన్నులు చెల్లించడం ఓ శిక్షే’నని అన్నారు. ఈ మేరకు పన్ను చెల్లింపులపై పలు మార్లు గతంలో ఆయన  చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. 

ఎన్నాళ్లు ఇలా ఊడిగం చేయాలి
కేంద్రం పన్నుల చెల్లింపు దారుల నుంచి 30 నుంచి 40 శాతం వరకు ట్యాక్స్‌ వసూలు చేస్తుందని, ప్రతిగా ఎలాంటి ప్రతిఫలం పొందలేకపోతున్నారని అశ్నీర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ట్యాక్స్‌ పేయర్లు తమ సంపాదనలో కొంత బాగాన్ని దేశానికి ఇస్తున్నారు. కానీ వాళ్లు ఎలాంటి లబ్ధి పొందడం లేదు. రూ.10 మనం (ట్యాక్స్‌ పేయర్లను ఉద్దేశిస్తూ) సంపాదిస్తే అందులో రూ.4 ప్రభుత్వానికే ఇస్తున్నాం. దీంతో 12 నెలల సమయంలో 5 నెలలు ప్రభుత్వానికే పనిచేస్తున్నారు. అయినా ఇలా ట్యాక్స్‌ పేయర్లు వారీ జీవితంలో ప్రభుత్వాలకు ఎన్నాళ్లు ఇలా ఊడిగం చేయాలని ప్రశ్నించారు. కానీ పరిస్థితుల్ని బట్టి నడుచుకోవాల్సిందే తప్పదు’’ అని వ్యాఖ్యానించారు.

ఉద్యోగులు ట్యాక్స్‌ ఎగవేతకు పాల్పడలేరు
అంతేకాదు, వ్యాపారస్థులకు ట్యాక్స్‌ కట్టకుండా ఎలా తప్పించుకోవాలో తెలుసు. కానీ ఉద్యోగుల పరిస్థితి అలా కాదు. వేరే ప్రత్యామ్నాయం లేదు. శాలరీ నుంచే ట్యాక్స్‌ కట్టాల్సి వస్తుంది. పైగా 18 శాతం జీఎస్టీ చెల్లిస్తున్నారు. అందుకే ట్యాక్స్‌ అనేది శిక్షతో సమానమేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు అశ్నీర్‌ గ్రోవర్‌. 

నేనే రాజకీయ నాయకుడిని అయితే
దేశంలో ఆదాయపు పన్ను రేటును తగ్గించేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరూ 10 నుంచి 15 శాతం ట్యాక్స్‌ కట్టేలా నిర్ధేశిస్తా. తద్వారా ఇప్పుడు ఎక్కువ పన్నులు కట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే పన్ను తక్కువగా ఎగవేతకు ప్రయత్నించరు. ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని అన్నారు. 

పార్టీలకు ఇచ్చే డొనేషన్లపై జీరో ట్యాక్సా
గత నెలలో విదేశాల్లో క్రెడిట్‌ కార్డ్‌  వినియోగంపై 20 శాతం టీసీఎస్‌ వసూలు చేయడాన్నీ గ్రోవర్‌ తప్పుబట్టారు. విదేశాల్లో క్రెడిట్‌కార్డు వాడకంపై 20 శాతం పన్ను పార్టీలకు ఇచ్చే డొనేషన్లకు మాత్రం జీరో ట్యాక్స్‌ అంటూ ఎద్దేవా చేశారు.

చదవండి👉 ‘విలాసాల రుచి మరిగి’..అశ్నీర్‌ గ్రోవర్‌, అతని భార్య మాధురి జైన్‌ గ్రోవర్‌కు మరో ఎదురు దెబ్బ!

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)