Breaking News

EY సంస్థకో దణ్ణం..రూ.కోటి జీతంతో చేరిన రెండో రోజే గుండెలో నొప్పిగా ఉందంటూ

Published on Fri, 09/20/2024 - 21:15

ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ అన్నా సెబాస్టియన్‌ పెరియాలి మరణంతో యర్నెస్ట్ అండ్‌ యంగ్‌ ఇండియా (ఈవై)సంస్థలో పని వాతావరణంపై చర్చ కొనసాగుతుంది. ఆ సంస్థ మాజీ ఉద్యోగులు సైతం వర్క్‌ కల్చర్‌పై తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. 

ఈ తరుణంలో భారత్‌పే మాజీ సహ వ్యవస్థాపకుడు అష్నీర్‌ గ్రోవర్‌ కోటి రూపాయల వేతనంతో చేరిన రెండో రోజే ఆ సంస్థ నుంచి బయటకు వచ్చారు. అయినా ఆ వర్క్‌ కల్చర్‌పై ప్రశంసలు కురిపిస్తూ అష్నీర్‌ గ్రోవర్‌ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోని సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ఆర్‌పీజీ గ్రూప్‌ చైర్మన్‌ హర్ష్‌ గోయోంకా ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

అన్నా సెబాస్టియన్‌ పెరియాలి మరణం సంస్థల్లో పని భారం వల్లేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై హర్ష్‌ గోయోంకా స్పందిస్తూ.. అష్నీర్‌ గ్రోవర్‌ మాట్లాడిన వీడియోని ఎక్స్‌ వేదికగా షేర్‌ చేశారు. ఆ వీడియోలో అష్నీర్‌ గ్రోవర్‌ మాట్లాడుతూ.. తాను రూ. కోటి వేతనంతో యర్నెస్ట్ అండ్‌ యంగ్‌ ఇండియా కంపెనీలో ఉద్యోగిగా చేరిన తొలిరోజే బయటకు వచ్చిన నిర్ణయాన్ని వెల్లడించారు.

చేరిన మొదటి రోజు ఆఫీసు మొత్తం కలియతిరిగాను. చుట్టూ చూశాను. అక్కడి వాతావారణం నాకు నచ్చలేదు. వెంటనే ఎదో ఒక్కటి చెప్పాలని.. నాకు గుండె నొప్పి వస్తుందని చెప్పి నటించాను.’ అని అన్నారు.  కార్యాలయ వాతావరణం ఎలా ఉంటుందో వివరిస్తూ ఇలాంటి పని వాతావరణంతో ఉద్యోగులు ప్రాణాలు పోవడమేనని అర్ధం వచ్చేలా వ్యాఖ్యానించారు. అంతే కాదు.. ఒక కంపెనీలో వర్క్‌ గురించి చెడుగా చెబుతున్నారంటే అది మంచిదని అర్థం అని అష్నీర్‌ గ్రోవర్‌ అన్నారు.  

విషపూరితమైన పని వాతావరణాన్ని ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేసిన అష్నీర్‌పై గోయెంకా ఆగ్రహం వ్యక్తం చేశారు. విషపూరిత వాతావరణం గురించి ఇలా పాజిటీవ్‌గా మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని కామెంట్‌ చేశారు. ఆ కామెంట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇదీ చదవండి : ఉద్యోగి అంత్యక్రియలకు వెళ్లని కంపెనీపై విమర్శలు

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?