మరింత పెరిగిన ఎప్రిలియా ఆర్ఎస్ 457 ధర

Published on Tue, 01/14/2025 - 17:46

ఎప్రిలియా భారతదేశంలోని తన ఆర్ఎస్ 457 బైక్ ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు రూ. 4.10 లక్షల ధర వద్ద లభించే ఈ మోటార్‌సైకిల్ ధర రూ. 4.20 లక్షలు (ఎక్స్ షోరూమ్) చేరింది. దీన్నిబట్టి చూస్తే దీని ధర మునుపటికంటే రూ.10,000 ఎక్కువని తెలుస్తోంది.

డిసెంబర్ 2023లో ప్రారంభమైన ఆర్ఎస్ 457 బైక్ భారతదేశంలో ఉత్పత్తి అయినా మొదటి ఎప్రిలియా మోటార్‌సైకిల్. ఇది మహారాష్ట్రలోని బారామతిలో పియాజియో గ్రూప్ ఫెసిలిటీలో తయారైంది. చూడటానికి అద్భుతంగా కనిపించే ఈ బైక్ మూడు రైడింగ్ మోడ్‌లు, త్రీ లెవెల్ స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ పొందుతుంది.

ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ 457 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజన్ పొందుతుంది. ఇది 47 బిహెచ్‌పి పవర్ అవుట్‌పుట్, 48 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఈ బైక్ మంచి పనితీరును అందిస్తుంది. కాబట్టి దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

ఏప్రిలియా ట్యూనో 457
ఏప్రిలియా ఇప్పుడు ఆర్ఎస్ 457 నేక్డ్ కౌంటర్‌పార్ట్.. ట్యూనో 457ని లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ స్ట్రీట్‌ఫైటర్ EICMA 2024లో వెల్లడైంది. అయితే కంపెనీ బైక్‌కి సంబంధించిన ధరలు రాబోయే నెలల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ బైక్ కూడా ఆర్ఎస్ 457 వలె అదే ఇంజిన్‌ పొందుతుంది. కాబట్టి అదే పర్ఫామెన్స్ అందిస్తుందని సమాచారం.

#

Tags : 1

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)