Breaking News

యాపిల్ కంపెనీ కొత్త ఉత్పత్తులు.. ఒకదాన్ని మించి మరొకటి

Published on Tue, 06/06/2023 - 10:01

Apple WWDC 2023: 2023 జూన్ 5 నుంచి ప్రారంభమైన 'డబ్ల్యూడబ్ల్యూడీసీ' (వరల్డ్​వైడ్​ డెవలపర్స్​ కాన్ఫరెన్స్​) మొదటి రోజే యాపిల్ సంస్థ విజన్​ ప్రో, కొత్త మాక్​ బుక్స్​, లేటెస్ట్​ ఓఎస్​ అప్​గ్రేడ్స్​ వంటి వాటిని లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త ఉత్పత్తులను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

విజన్​ ప్రో
యాపిల్ కంపెనీ డబ్ల్యూడబ్ల్యూడీసీలో విడుదల చేసిన విజన్​ ప్రో అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్శించింది. సంస్థ చరిత్రలోనే మిక్స్​డ్​ రియాలిటీ హెడ్​సెట్​. దీనిని గ్లాస్ఎం కార్బన్ ఫైబర్, అల్యూమినియం మిశ్రమాలతో తయారు చేసారు. దీని ధర 3,499 డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.2.88 లక్షలు.

ఈ విజన్​ ప్రో కర్వడ్​ ఫ్రేమ్​, ఫ్రెంట్​ గ్లాస్​, థర్మల్​ వెంట్స్​, ఎడమవైపు పుష్​ బటన్స్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా ఇందులో డ్యూయెల్​ 1.41 ఇంచెస్​ 4కే మైక్రో ఓఎల్​ఈడీ, 23 మిలియన్​ కంబైన్డ్​ పిక్సెల్స్​, 12 కెమెరాలు ఉన్నాయి. అయితే ఇందులో ఎలాంటి కంట్రోలర్స్​, హార్డ్​వేర్​ లేవు కానీ కెమెరాలతో కళ్లు ట్రాక్​ అయ్యి యాప్​ ఓపెన్ అవుతుంది. 

విజన్​ ప్రోలో ఎమ్2 చిప్​, ఆర్​1 కోప్రాసెసర్​, 16జీబీ ర్యామ్​ వంటివి ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ ఆడియో​ డ్రైవర్స్​, 6 మైక్రోఫోన్స్​, 6 సెన్సార్స్​, కంపాస్​, యాంబియెంట్​ లైట్​ సెన్సార్​, యాక్సలరోమీటర్​, గైరోస్కోప్​ వంటి సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి. వైఫై, బ్లూటూత్​, సిరి, టైప్​-సీ ఛార్జర్​ వంటివి కనెక్టెడ్​ ఫీచర్స్​ లభిస్తాయి. 

15 ఇంచెస్ మాక్​బుక్​ ఎయిర్
డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్​లో కంపెనీ '15 ఇంచెస్ మాక్​బుక్​ ఎయిర్'ని​ విడుదల చేసింది. ఇది థండర్​బోల్ట్​ పోర్ట్స్​, మాగ్​సేఫ్​ ఛార్జింగ్​ పోర్ట్​ వంటి వాటిని పొందుతుంది. ఇది నాలుగు కలర్ ఆప్షన్స్‌లో వచ్చే వారం నుంచి అందుబటులో ఉండే అవకాశం ఉంటుంది. ఇందులోని బ్యాటరీ ప్యాకప్ వ్యవధి సుమారు 18 గంటల వరకు ఉంటుంది.

(ఇదీ చదవండి: భారత్‌లో ఎక్కువ రేంజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు - ఈక్యూఎస్ 580 నుంచి ఆట్టో 3 వరకు..)

అప్డేటెడ్ మాక్​ స్టూడియో
యాపిల్ సంస్థ 2023 డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్​లో ఎం2 మ్యాక్స్​, ఎం2 అల్ట్రా చిప్​సెట్స్​ వంటి వాటిని రిలీవ్ చేసింది. ఇప్పటికే మాక్​బుక్​ ప్రో మోడల్స్​లో ఎం2 మ్యాక్స్ అందుబాటులో ఉంది. కొత్త మోడల్ దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా వేంగంగా పనిచేస్తుండనై కంపెనీ వెల్లడించింది. మాక్​ స్టూడియో ప్రారంభ ధర భారతదేశంలో రూ. 2.99 లక్షలు కాగా, మ్యాక్ ప్రో ధర రూ. 7.29 లక్షలు.

(ఇదీ చదవండి: దేశంలో మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారు - టెక్నాలజీలో భళా భారత్)

ఐఓఎస్ 17
సంస్థ మెసేజెస్, ఫేస్​టైమ్​ యాప్స్​ కోసం ఐఓఎస్​ 17 లాంచ్ చేసింది. కావున ఇప్పుడు టైపోగ్రఫీతో కస్టమైజ్​డ్​ పోస్టర్లను తయారు చేసుకోవచ్చు. ఆటో- కరెక్ట్​, డిక్టేషన్​ వంటి ఫీచర్స్​ మరింత మెరుగుపడ్డాయి. ఐఓఎస్​ 17లో జర్నల్​ అనే కొత్త యాప్​ వస్తోంది. ఇందులో యూజర్లు తమకు నచ్చినవి రాసుకోవచ్చు. 2023 డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్​లో ఐపాడ్ఓఎస్17, మ్యాక్ఓఎస్ సోనోమా, వాచ్ఓఎస్ 10, టీవీఓఎస్ 17 వంటి వాటిని కూడా సంస్థ పరిచయం చేసింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)