Breaking News

యాపిల్ కీలక నిర్ణయం: మొదటిసారి భారత్‌లో..

Published on Tue, 08/20/2024 - 21:14

యాపిల్ కంపెనీ తన 'ఐఫోన్ ఎస్ఈ' 2017లో భారతదేశంలో ఉత్పత్తిని ప్రారంభించింది. అప్పటి నుంచి ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 15 వంటివన్నీ మన దేశంలోనే తయారయ్యాయి. అయితే కంపెనీ ఇప్పటి వరకు ఇండియాలో ఎప్పుడూ ప్రో వేరియంట్‌లను తయారు చేయలేదు. ఇప్పుడు మొదటిసారి ఐఫోన్ 16 ప్రో మోడల్ తయారు చేయనున్నట్లు సమాచారం.

యాపిల్ కంపెనీ ప్రో మోడల్ మొబైల్స్ తయారు చేయనున్నట్లు చెప్పడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో కూడా యాపిల్ భారతదేశంలో ఐఫోన్ 16 ప్రో & ఐఫోన్ 16 ప్రో మాక్స్ మోడల్‌ల తయారీని ప్రారంభించాలని యోచిస్తోందని పేర్కొంది. ప్రారంభంలో ఎంట్రీ-లెవల్, పాత ఐఫోన్ మోడళ్లపై దృష్టి సారించిన కంపెనీ క్రమంగా అప్డేటెడ్ మోడల్స్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది.

వచ్చే 3 - 4 సంవత్సరాలలో దేశంలో మొత్తం ఐఫోన్ ఉత్పత్తిలో 25 శాతం లక్ష్యంగా, యాపిల్ తన ప్రపంచ ఉత్పత్తిలో భారతదేశ వాటాను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే 16 ప్రో మోడల్స్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది.  స్థానిక ఉత్పత్తిని ప్రపంచవ్యాప్త విడుదలతో సమకాలీకరించాలనే లక్ష్యంతో ఫాక్స్‌కాన్ ఇప్పటికే తమిళనాడులోని తన సదుపాయంలో వేలాది మంది కార్మికులకు శిక్షణ ఇవ్వడం కూడా ప్రారంభించింది. దీన్ని బట్టి చూస్తుంటే కంపెనీ తన లక్ష్యాన్ని వేగంగా చేరుకుంటుందని స్పష్టంగా తెలుస్తోంది.

#

Tags : 1

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)